end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంన్యూ ఇయర్‌ వేడుకలు బంద్‌
- Advertisment -

న్యూ ఇయర్‌ వేడుకలు బంద్‌

- Advertisment -
- Advertisment -

సైబరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చేసుకునేందుకు పోలీసుశాఖ నో చెప్పింది. సైబరాబాద్‌ పరిధిలో కొత్త సంవత్సర వేడుకలకు ఎలాంటి అనుమతి లేదని సీపీ సజ్జనార్‌ వెల్లడించగా, హైదరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ మీడియాతో మాట్లాడారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రిసార్టులు, పబ్‌లు, హోటళ్లల్లో కొత్త సంవత్సర సంబురాలకు ఎలాంటి అనుమతి లేదు.

రిసార్టులు, పబ్‌లపై నిఘా ఉంచాం. గేటెడ్‌ కమ్యూనిటీస్‌, అపార్టుమెంట్లు, కాలనీల్లో కూడా వేడుకలు నిషేధం. ఎవరైనా న్యూఇయర్‌ సెలబ్రేషన్లు నిర్వహించినా, ఈవెంట్ల పేరిట టికెట్లు విక్రయించినా, వినోదాత్మక కార్యక్రమాలు పెట్టినా చట్టరీత్యా చర్యలు తప్పవు.’ అని సీపీ అన్నారు. ఎక్కడైనా వినోదాత్మక కార్యక్రమాలు పెట్టినా, నిర్వహిస్తున్నట్లు తెలిసినా వెంటనే సైబరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 31వ తేదీ రాత్రి యథావిధిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -