end
=
Saturday, October 5, 2024
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ
- Advertisment -

తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ

- Advertisment -
- Advertisment -
  • ఏప్రిల్‌ 20 రాత్రి 9 గంటల నుండి మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
  • హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం
  • కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకే

తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్‌ ఉదృతి రోజు రోజుకు పెరుగుతోంది. కేవలం ఒక్క రోజులోనే 5,926 పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. 18 మంది మృత్యువాతపడ్డారు. 42,853 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి దారుణంగా తయారైంది. హైకోర్టు ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడం కోసం రాష్ర్ట ప్రభుత్వం తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. ఏప్రిల్‌ 20 రాత్రి 9 గంటల నుండి మే 1 ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అన్ని దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, బార్‌లు, వైన్స్‌ రాత్రి 8 గంటలకే మూసి వేయాల్సి ఉంటుంది. కేవలం ఆసుపత్రులు, ఫార్మసీలు, పెట్రోల్‌ బంక్‌లు, మీడియాకు అనుమతి ఉంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -