end
=
Tuesday, January 21, 2025
వార్తలుజాతీయంనితీశ్ కుమార్ 8వసారి ప్రమాణం..
- Advertisment -

నితీశ్ కుమార్ 8వసారి ప్రమాణం..

- Advertisment -
- Advertisment -

బిహార్​ రాజకీయాల్లో జేడీయూ అధినేత నితీశ్​ కుమార్​ది ప్రత్యేక స్థానం. వికాస్‌ పురుష్‌గా, క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరుంది.భాజపాకు గుడ్​బై చెప్పి.. ఆర్​జేడీ, కాంగ్రెస్​తో కలిశారు. మహాకూటమి పార్టీల మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. నితీశ్‌ కుమార్‌ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017, 2020లో సీఎంగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ బిహార్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు.

ఈ రోజు (ఆగస్టు 10) సాయంత్రం 4 గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. నితీశ్ తోపాటు కూటమిలోని కొందరు నేతలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఆర్జేడీ – కాంగ్రెస్ – లెఫ్ట్ సారథ్యంలో మహాఘట్‌బంధన్‌ ఏర్పాటు చేశారు. బీహార్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మంగళవారం (ఆగస్టు 9) బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. వెంటనే గవర్నర్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ ఉందని తెలుపుతూ లేఖలు సమర్పించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని నితీశ్ వెల్లడించారు. రెండు గంటల వ్యవధిలోనే గవర్నర్‌ను నితీశ్ కుమార్ రెండుసార్లు కలిశారు.

బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది.ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌కు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఎనిమిదోసారి కావడం విశేషం. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ సారథ్యంలోని 7 పార్టీలతో కూడిన మహాఘట్‌బంధన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నితీశ్ కుమార్ ప్రకటించారు. జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీల కోరిక మేరకే తాము ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నామని నితీశ్ స్పష్టం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -