- హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్
- బషీర్‌బాగ్ కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్
Nizam College : హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళనకు(protest) దిగారు. దీంతో నగరంలోని బషీర్‌బాగ్(Basheerbagh) కూడలిలో భారీగా ట్రాఫిక్ జామ్(traffic Jam) అయ్యింది. అండర్ గ్రాడ్యుయేట్(UG Students) విద్యార్థులకు నిజాం కాలేజీలో హాస్టల్ సదుపాయం(Hostel Facility) కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ పోలీసులు ( traffic police) అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. అయితే విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు(slogans against principal) చేస్తూ రోడ్డుపై ఆందోళనలకు దిగారు.
(girls died: మట్టిలోకూరుకుపోయి బాలికలు మృతి)
పోలీసులు ఆందోళన విరమించాలని విద్యార్థులను ఎంత కోరినా తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు తమ ఆందోళనలు ఆపమని తేల్చి చెప్పారు. హాస్టల్ వసతి కల్పిస్తామని తమకు నిజాం కళాశాల ప్రిన్సిపాల్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే విద్యార్థుల నిరసనలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు(motorists) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Rowdy Hero:హిందీ భాషను ఎగతాళి చేసిన విజయ్ దేవరకొండ..