- మరో సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
వాహనాల (Vehicle) విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త కొత్త నిబంధనలు (New rules)అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పాత వాహనాలను స్క్రాప్‌గా (Scrap the old vehicles) మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో గడువు తీరిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేలా ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ (Issuance of draft notification) చేసినట్లు పలు నివేదికలు వెల్లడవుతున్నాయి. దేశంలో కాలుష్యం (Pollution)పెరిగిపోతుండటంతో వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. పాత వాహనాలను (Old vehicles)రద్దు చేసే పనిలో పడింది. గడువు తీరిన వాహనాలు రోడ్ల (Road)పై నడుస్తుండటంతో కాలుష్యం పెరిగిపోతోందని భావించిన కేంద్రం వాటిని రద్దు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
2023 ఏప్రిల్ తర్వాత ఆ వాహనాలు రద్దు:
వచ్చే ఏడాది (Next year) అంటే 2023 ఏప్రిల్ (April)1 నుంచి దేశంలో 15 సంవత్సరాలు దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర నివేదికలు తెలిపాయి. కార్పొరేషన్, రవాణా శాఖ బస్సులు, (Corporation, Transport Department buses,) ఇతర వాహనాలకు ఈ కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు తప్పనిసరి వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. రాబోయే 30 రోజుల్లో ఇందుకు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలను తెలుపాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (Union Ministry of Transport) తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ comments-morth@gov.in కు పంపించాలని కోరింది. అయితే కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకువచ్చింది.
(DELHI:AIIMSలో 6 రోజులుగా నిలిచిన సర్వర్)
15 ఏళ్లు దాటిన వాహనాలను స్క్రాప్‌గా మార్చేస్తాం: నితిన్ గడ్కరీ
15 ఏళ్లు దాటిన వాహనాలన్నింటిని (Vehicles over 15 years old) స్క్రాప్‌గా (Scrap) మార్చేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Transport Minister Nitin Gadkari) తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు తెలిపారు. పాత వాహనాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన అధికారిక ఫైల్‌లో సంతకం కూడా చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కూడా వెహికల్ స్క్రాపేజ్ పాలసీ (Vehicle Scrappage Policy) ని అమలు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.