- భారతదేశంలో చిక్కుకుపోయిన ఆస్ర్టేలియావాసులు
- ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ అనుమతిలేదు
- సిడ్నీ కోర్టు స్పష్టీకరణ
ప్రస్తుతం భారతదేశం కోవిడ్ కోరల్లో చిక్కుకొని పోయింది. ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. అంతర్జాతీయంగా ప్రయాణాలు నిలిచిపోయాయి. ఎందరో విదేశీయులు మనదేశంలోని ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ తదితర ప్రధాన పట్టణాల్లో చిక్కుకుపోయారు. ఇందుకు ఆస్ర్టేలియా ఒకడుగు ముందుకు వేసి భారత్‌పై పూర్తిగా నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా నుండి ప్రయాణీకులను అనుమతించబోమని చాలా స్పష్టంగా చెప్పేసింది. చివరికి భారతదేశానికి టూరిజం కోసం వచ్చిన ఎంతో మంది ఆస్ర్టేలియా వాసులను కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశానికి రానివ్వడం లేదు. ఇదివరకే అంతర్జాతీయంగా పలు దేశాలు విమాన సర్వీసులను భారత్‌కు నిలిపివేశాయి.
సింగపూర్ ఎయిర్ లైన్స్, ఇండోనేషియా, దుబాయ్ తదితర దేశాలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఎవరైనా వేరే మార్గం ద్వారా ఆస్ర్టేలియా రావడానికి ప్రయత్నిస్తే చాలా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధంపై ఆస్ర్టేలియా రాజధాని సిడ్నిలో వివాదం కొనసాగుతోంది. భారతదేశం నుండి ఆస్ర్టేలియా వాసులు వెనక్కి రావడానికి అనుమతించాలని సిడ్నీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దేశ ప్రజల ఆరోగ్యం, ఇతర కారణాల వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ అనుమతించరాదని కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
ఎవరైనా ఆంక్షలు దిక్కరించి వస్తే 66 వేల డాలర్ల జరిమానాతో పాటు 5 సంతవ్సరాల జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇక భారతదేశంలో చిక్కుకొని ఉన్న ఆస్ర్టేలియావాసులు తమ దేశం ఎప్పుడు అనుమతిస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధానీ నరేంద్ర మోడి జోక్యం చేసుకొని విదేశీయులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరి దేశం వారు వెళ్లే విధంగా ఆయా దేశాల ద్వౌత్తవేత్తలతో మాట్లాడితే బాగుంటుంది.