కేంద్ర బడ్జెట్ 2022-23 పసలేని బడ్జెట్ అని, ఏ నిర్దేశం లేని పనికిమాలిన బడ్జెట్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన సందర్భంగా కేసీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యవసారంగాన్ని అదుకునే చర్యలు లేవని, అలాగే చేనత రంగం, ఉద్యోగులు, చిరువ్యాపారులను నిరాశకు గురిచేసందన్నారు. ఇది పూర్తి అసంబద్ధమైన గోల్‌మాల్ బడ్జెట్ అని విమర్శించారు. వైద్యం, ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిందన్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ల స్లాబ్‌లు మార్చకపోవడం విచారకరం.