end
=
Saturday, January 18, 2025
క్రీడలుMohammad shami:యాబై వేలు కాదు.. పది లక్షలు కావాలి
- Advertisment -

Mohammad shami:యాబై వేలు కాదు.. పది లక్షలు కావాలి

- Advertisment -
- Advertisment -
  • మహ్మద్ షమీ భార్య హసిన్ డిమాండ్

ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీకి (Indian cricketer Mohammed Shami) కోల్‌కతా హై కోర్టు (Kolkata High Court)షాకిచ్చింది.గతంలో విడాకులిచ్చిన భార్య హసిన్ జహన్‌ (Hasin Jahan)కు నెలకు రూ.50 వేల జరిమానా చెల్లించాలని కోల్‌కతా హై కోర్టు ఆదేశించింది. నాలుగేళ్ల క్రితం షమీపై జహన్ అనేక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు నిర్దేశించిన భరణంపై జహన్ అసంతృప్తిగా ఉన్నారు. ఆమె నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరుకుంటోంది. నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని 2018లో జహన్ లీగల్ కేసు (legal case)పెట్టారు. ఇందులో రూ.7 లక్షలు వ్యక్తిగత అవసరాలకు, రూ.3 లక్షలు కూతురును చూసుకునేందుకని జహన్ తన కేసులో పేర్కొన్నారు.

(BBC: BBC డాక్యుమెంటరీని ప్రదర్శిస్తాం)

అయితే తాజాగా వెలువడిన కోల్‌కోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న జహన్ మరింత ఎక్కువ భరణం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది. వ్యభిచారం, గృహ హింస (Adultery, domestic violence) ఆరోపణలతో జహన్ జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్‌ (Jahan Jadavpur Police Station)లో కేసు పెట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. దీంతో షమీపై గృహ హింస, హత్యాయత్నం వంటి నాన్ బెయిలబుల్ కేసులు (Non-bailable cases) నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని తన పుట్టింటికి వెళ్లినపుడల్లా భర్త షమీ, ఆయన కుటుంబ సభ్యులు హింసించేవారని జహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -