end
=
Tuesday, January 21, 2025
క్రీడలుపుజారాకు అంత ఈజీ కాదు..
- Advertisment -

పుజారాకు అంత ఈజీ కాదు..

- Advertisment -
- Advertisment -

ఆస్ట్రేలియాలో.. భారతజట్టు టీ20, వన్డేలతో పాటు 4 టెస్టులాడననుంది. రెండు జట్ల బలాబలాలు చూస్తే.. ఇరు జట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌ ద్వారా మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించినట్లైంది. ఆసీస్ఆ టగాళ్లు కూడా కొందరికి ఫుల్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లభించింది. వారిలో స్మిత్‌, వార్నర్‌, కమ్మిన్స్‌, హెజెల్‌వుడ్‌ తదితరులున్నారు. కాగా, క్రితం సారి భారతజట్టు.. ఆసీస్‌ పర్యటించి టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా చక్కటి ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించి, ఐదు వందలకు పైగా పరుగులు రాబట్టాడు.

కాగా, పుజారాకు ఈ సిరీస్‌లో కంగారూ బౌలర్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాందంటున్నాడు ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌. క్రితం పర్యటనలో పుజారా మంచి ప్రదర్శన చేయొచ్చు కానీ, ఈ సారి ఆ సీన్ రిపీటవదుంటున్నాడు. పుజారా టీమిండియాలో కీలక ఆటగాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్‌ తొలి ఓవర్‌ నుంచి పరుగులు చేయాలనుకుంటారు. కానీ, పుజారా అలా కాదు. క్రీజులో నిలదుక్కుకునేందుకు అతడు కొంచెం సమయం తీసుకుంటాడు. అనంతరం, బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడని మెక్‌గ్రాత్‌ తెలిపాడు. కానీ, చాలా రోజుల నుంచి పుజారా మైదానానికి దూరంగా ఉంటున్నాడు. అతనికి సరైన నెట్‌ ప్రాక్టీస్‌ కూడా లేదు. కనుక బీభత్సమైన ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కోవాలంటే పుజారాకు తిప్పలు తప్పవంటున్నాడు ఈ ఆసీస్‌ దిగ్గజం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -