సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force,), కానిస్టేబుల్ (Constable) (driver), కానిస్టేబుల్స్ (డ్రైవర్-కమ్-పంప్-ఆపరేటర్-ఫైర్ సర్వీస్) (Driver-cum-Pump-Operator-Fire Service) ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది ఫిబ్రవరి 22.
పోస్టుల వివరాలు:
- కానిస్టేబుల్ /డ్రైవర్ – 183 (యూఆర్ (UR) – 76, ఎస్సీ (SC) – 27, ఎస్టీ (ST)- 13, ఓబీసీ (OBC)-49, ఈడబ్ల్యూఎస్ (EWS)-18)
- కానిస్టేబుల్ /డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ (ఫైర్ సర్వీస్): 268 ( యూఆర్ -111, ఎస్సీ – 40, ఎస్టీ – 19, ఓబీసీ – 72, ఈడబ్ల్యూఎస్ – 26)
మొత్తం ఖాళీలు: 451
అర్హత:
మెట్రిక్యులేషన్ (Matriculation) లేదా సమాన అర్హతలుండాలి. డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) (హెవీ మోటార్ వెహికల్ లేదా టాన్స్ పోర్ట్ వెహికల్: లైట్ మోటార్ వెహికల్, మోటార్ సైకిల్ విత్ గేర్)తో పాటు మూడేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు :
ఎత్తు 167 సెం.మీ., ఛాతీ కొలత 80 -85 సెం.మీ ఉండాలి.
వయసు:
21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం:
నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 ఉంటుంది.
(Indian Army:ఇండియన్ ఆర్మీలో జడ్జి అడ్వకేట్ పోస్టులు)
ఎంపిక:
ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ (Physical Standards Test, Physical Efficiency Test, Documentation, Trade Test, Written Test, Medical) ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు:
ఆన్‌లైన్ (online) ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేది:
ఫిబ్రవరి 22, 2023.
వెబ్‌సైట్: https://cisfrectt.in