ఇండియన్ ఆర్మీ షార్ట్ సర్వీస్ కమిషన్ (Short Service Commission) (SSC) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం 54వ కోర్సు (అక్టోబరు 2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆఫీసర్లు – 55
- ఎన్‌సీసీ మెన్ (NCC Men)- 50
(జనరల్ కేటగిరి – 45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి – 5) - ఎన్‌సీసీ విమెన్ (NCC Women) – 5
(జనరల్ కేటగిరి -4, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి – 1)
అర్హత:
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ (NCC C Certificate) ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
నోట్:
యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి కనీసం 50 మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (Any degree pass with 50 marks) ఉండాలి (ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉండాల్సిన అవసరం లేదు)
వయసు:
జులై 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 1998 జులై 2 నుంచి జులై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.
స్టైపెండ్:
నెలకు రూ. 56,100 ఉంటుంది.
ఎంపిక:
షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రెండు స్టేజ్ లు ఉంటాయి. స్టేజ్ -1లో ఎంపికైన వారికి స్టేజ్ -2 ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ఉంటుంది. చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 17, 2023.
చివరితేది: ఫిబ్రవరి 15, 2023.
వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in
(Scholarship:నర్సింగ్ విద్యార్థులకు 50వేల స్కాలర్షిప్)