end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంగల్లంతైన ఎన్ టీవీ ఛానల్ రిపోర్టర్ జమీర్...
- Advertisment -

గల్లంతైన ఎన్ టీవీ ఛానల్ రిపోర్టర్ జమీర్…

- Advertisment -
- Advertisment -

జిల్లా రాయికల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వరద నీటిలో చిక్కుకున్న వారి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన రిపోర్టర్. కారుతో పాటు వరదలో కొట్టుకుపోయారు. ఆయన కోసం గ్రామస్థులు, రెస్క్యూ టీమ్ గాలిస్తున్నారు. మంగళవారం (జులై 12) రాత్రి 8.30 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గోదావరి నది ప్రవాహంలో 9 మంది వ్యవసాయ రోజు వారి కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాలు జారీ చేశారు. అవసరమైతే హెలికాప్టర్ వినియోగించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాధితులను సురక్షితంగా తీసుకొచ్చారు.

అయితే.. ఈ వార్త కవరేజ్ చేసేందుకు ఎన్ టీవీ ఛానల్ రిపోర్టర్ జమీర్ తన సొంత వాహనంలో వెళ్లారు. ఆయనతో పాటు సయ్యద్ రియాజ్ అలీ అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. బోర్నపల్లి నుంచి జగిత్యాల తిరిగొచ్చేందుకు వీరు గూగుల్ మ్యాప్ సాయం తీసుకున్నారు. మార్గమధ్యంలో రామోజీపేట్ గ్రామం సమీపంలో వీరు తాము ప్రయాణిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారును ప్రధాన రహదారి నుంచి షార్ట్ కట్ రూట్‌కు డైవర్ట్ చేశారు. భూపతిపూర్ డ్యామ్ వద్ద రోడ్డు పైనుంచి వాగు చాలా వేగంగా ప్రవహిస్తోంది. కారును ఆ ప్రవాహం నుంచి ముందుకు తీసుకెళ్లడంతో ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

కారులోంచి బయటపడ్డ సయ్యద్ రియాజ్ అలీ ఎలాగోలా తప్పించుకొని గ్రామంలోకి పరుగెత్తాడు. గల్లంతైన రిపోర్టర్ జమీర్ కోసం పోలీసులు, రెస్క్యూ బృందాలు, గ్రామస్థులు గాలిస్తున్నారు. ఈ వార్త తెలియగానే జమీర్ కుటుంబసభ్యులు, తోటి పాత్రికేయులు ఆందోళన చెందుతున్నారు. జమీర్ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబసభ్యులు స్నేహితులు ప్రార్థిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -