end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌వంటలునువ్వుల లడ్డు - ఆరోగ్య ప్రయోజనాలు
- Advertisment -

నువ్వుల లడ్డు – ఆరోగ్య ప్రయోజనాలు

- Advertisment -
- Advertisment -

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచివని అందరికి తెలుసు. కానీ కొందు నువ్వులను తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే అవి చేదుగా ఉంటాయని, తింటే అరగవని కొందరి నమ్మకం. అయితే నువ్వులను చాలా మంది పొడి చేసి మసాలా కర్రీలలో వేస్తారు. మరికొందరు నువ్వులకారం తయారు చేసుకుంటారు. అయితే నువ్వులు + బెల్లంతో లడ్డూను తయారు చేస్తే చిన్నపిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకు నోరూరిస్తాయి. నవ్వులు + బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు.

కావాల్సిన పదార్థాలుః

  1. బెల్లం 100 గ్రాములు
  2. తెల్ల నువ్వులు 250 గ్రాములు

తయారు చేయు విధానంః

ముందుగా నువ్వులను తీసుకొని పెనం మీద లైట్‌ గా వేయించి పక్కనపెట్టుకోవాలి. తర్వాత బెల్లంను ముక్కులుగా చేసి ఉంచుకోవాలి ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి బాగా వేడిచేయాలి. తర్వాత వేడి నీటిలో బెల్లం ముక్కలను వేసి బాగా కలపాలి. పాకం వచ్చే వరకు వేడి చేయాలి. మంట తగ్గించుకొని వేయించిన నువ్వులను బెల్లం పాకంలో వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్‌ ఆపు చేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారకముందే చేతులకు నెయ్యి లేదా వంటనూనెను చేతులకు రాసుకొని కొద్ది కొద్దిగా ముద్దలు చేసుకొని లడ్డూ చుట్టుకోవాలి. తర్వాత గాలికి ఆరబెట్టుకోవాలి.

నువ్వుల లడ్డు ప్రయోజనాలుః

  • శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • ఈ లడ్డులో ఉండే బెల్లం రక్తంలోని ఐరన్‌ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో మేలు
  • డయాబెటీస్‌ ఉన్నవారు నువ్వుల లడ్డు తింటే కొంచెం అదుపులో ఉంటుంది
  • నువ్వులలో ఉండే ‘సెసమాల్‌’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ గుండె సమస్యలను దూరం చేస్తాయి
  • రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది
  • శరీరం బల పడటానికి నువ్వులు బెల్లం ఎంతో దోహదపడతాయి
  • రక్తనాళాలు, ఎముకలు, కీళ్లు సక్రమంగా పనిచేసేందుకు నువ్వుల్లోని పోషకాలు తోడ్పడతాయి.
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -