పర్యాటక జట్టు శ్రీలంక (Sri Lanka)తో మూడు వన్డేల (odi)సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మంగళవారం (Tuesday)జరగనుంది. వన్డే జట్టుకు ఎప్పటిలానే రోహిత్ శర్మ (Rohit sharma)నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్ (series)ను గెలుచుకొచ్చిన హార్దిక్ పాండ్యా (Hardik pandya)తన నాయకత్వ బాధ్యతలకు న్యాయం చేయగా, ఇక వన్డే సిరీస్ గెలవడం రోహిత్ వంతు. టీ20 జట్టు తరహాలోనే వన్డే జట్టు సైతం ఎక్కువగా యువకులతో నిండి ఉండటం భారత్‌కు సానుకూలం. టీ20 సిరీస్ గెలిచిన గెలిచిన ఉత్సాహం బోనస్. దీంతో టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ను సైతం దక్కించుకోవాలనే ఊపుతో ఉంది. అయితే, ప్రత్యర్థి శ్రీలంకను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మూడు టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌కు గట్టిపోటీనిచ్చింది. ఒకరు కాకపోతే మరొకరు జట్టును ఆదుకుంటున్నారు. పైగా, ఓడిన కసితో ఉన్న లంక.. కనీసం వన్డే సిరీస్‌నైనా పట్టుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. యువ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత టీ20 జట్టు 2-1తేడాతో సిరీస్‌ను గెలిచేసింది. ఇందులో ఒక మ్యాచ్ ఓడి, మరో మ్యాచ్ కష్టంగా గెలిచినా.. అంతిమంగా ఫలితమే ముఖ్యం. కాబట్టి, జట్టును నడిపించడంలో హార్దిక్ పాండ్యా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. దీంతో ఇక అందరి కళ్లూ వన్డే సిరీస్‌పై పడ్డాయి.
రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్, సూర్యకుమార్, అయ్యర్ (Rohit Sharma, Kohli, KL Rahul, Gill, Suryakumar, Iyer,), హార్దిక్ పాండ్య వంటి ప్లేయర్లతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగానే కనిపిస్తోంది. అక్షర్ పటేల్ సైతం మంచి ఫామ్‌లో ఉండటం, వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ చేయగలగడం భారత్‌కు కలిసొచ్చే అంశం. కానీ, గతకొన్ని మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్, రోహిత్, హార్దిక్ నిరాశపరుస్తుండటం కలవరపెట్టే అంశం. కోహ్లీ సైతం ఈ సిరీస్‌లో స్థిరత్వాన్ని కొనసాగించాల్సి ఉంది. అయితే, తుది జట్టులో సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్‌లలో ఒకరికే చోటు దక్కనుంది. 2022లో భారత్ తరఫున వన్డేల్లో టాప్ స్కోరర్‌గా శ్రేయస్, మరోవైపు, ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ ఉండటంతో తుది జట్టులోకి ఎవరిని తీసుకోవాలనేది సెలక్టర్లకు తలనొప్పిగా మారింది. అయితే, అయ్యర్‌ను తీసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, జట్టు మంచి స్కోరు చేయాలంటే ఓపెనింగ్ భాగస్వామ్యం కీలకం. ఈ విషయంలో కొద్దిరోజులుగా భారత్ సతమతమవుతోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్, శుభమన్ గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వీరు మంచి భాగస్వామ్యం నెలకొల్పితేనే తర్వాతి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడగలుగుతారు.
వెన్నెముక గాయంతో కొద్దినెలలుగా భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న స్టార్ పేసర్ బుమ్రా.. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ మొదలయ్యేవరకు పూర్తిగా కోలుకుంటాడని భావించిన బీసీసీఐ.. జట్టులో అతన్ని పేరునూ చేర్చింది. అయితే, అనుకున్నట్టుగా బుమ్రా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. ఆయనకు మరికొంత విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు సూచించారు. దీంతో బుమ్రాను వన్డే సిరీస్ నుంచే తప్పిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. భవిష్యత్‌లో అతను మరింత క్రికెట్‌ను ఆడాల్సి ఉందని కాబట్టి, తొందరపడి ఆయనను జట్టులోకి తీసుకుని రిస్క్ చేయలేమని కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం వెల్లడించాడు. దీంతో బౌలింగ్ దళాన్ని మహ్మద్ షమీ నడిపించనున్నట్టు తెలుస్తోంది. షమీతోపాటు మరో పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్లు యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు ప్రధాన బౌలర్లుగా ఉండనుండగా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అదనపు బలంగా చెప్పొచ్చు. అయితే, రెండో టీ20లో లంకను 200కు పైగా పరుగులు దాటించిన విషయాన్ని గుర్తుపెట్టుకుని, వికెట్లు తీస్తూనే పొదుపుగా బౌలింగ్ చేయడంపై దృష్టిసారించాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యర్థి శ్రీలంకను తక్కువ అంచనా వేయొద్దని విశ్లేషకులు చెబుతున్నారు. కెప్టెన్ దసున్ శంకర గత టీ20ల్లో ఉత్తమ ప్రదర్శన చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్ కుశల్ మెండిస్ సైతం క్రీజులో నిలదొక్కుకుంటే జట్టుకు మంచి స్కోరు అందించగలడు. మిగతా బ్యాటర్లు పాథున్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డి సిల్వా, చరిత్ అసలంక గత మ్యాచ్‌లలో రాణించలేదు. కాబట్టి, ఈ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చేందుకు గట్టి ప్రయత్నమే చేసే అవకాశముంది. బౌలింగ్ విషయానికొస్తే, జెఫ్రే వండర్సే, లాహిరు కుమారా, కసున్ రజిత, మహీశ్ తీక్షణ వంటి ప్లేయర్లతో బలంగానే ఉంది. సమిష్టిగా రాణిస్తే వీళ్లను ఆపడం కష్టమే. కాగా మధ్యాహ్నం 1:30 నుంచి ప్రారంభం
తుది జట్ల అంచనా
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(కీపర్), శ్రేయస్ అయ్యర్/సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాథున్ నిస్సంక, కుశల్ మెండిస్(కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనుంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ శనక(కెప్టెన్), వానిండు హసరంగ, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, లాహిరు కుమార, జెఫ్రే వండర్సే.