end
=
Friday, September 20, 2024
బిజినెస్‌ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఓలా
- Advertisment -

ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఓలా

- Advertisment -
- Advertisment -

ఓలా కంపెనీ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది. ఇందులో చదువు రానివారున్నారు బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల బ్యాటరీ లోపాల కారణంగా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ కారణం గా ఓలా కంపెనీ తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది.దీనివల్ల తమ ఆర్ధిక సమస్యల నుంచి తప్పించు కోవాలి అని తన సేవలను పరిమితం చేయడంతో పాటు, గ్లోబల్ ఫండింగ్ వాతావరణం ప్రతిబంధకంగా మారుతున్న నేపథ్యంలో సాఫ్ట్‌బ్యాంక్-సపోర్ట్ ఉన్న ఈ కంపెనీ అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించిందని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన వార్తలో తేలింది. అయితే ఎన్ని ఉద్యోగాలు కోల్పోతాయో వారు పేర్కొనలేదు. గత మూడు వారాలుగా ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది.

ఒక నెల వేతనం తీసుకొని వెళ్లిపోవాలని లేదా నోటీసు వ్యవధిని అందించాలని అడుగుతున్నారని ఉద్యోగులు ఆందోళనకి గురి అవుతున్నారు. ఉద్యోగుల పరిస్థితి అయోమయంలో ఉంది. నమ్ముకున్న కంపెనీ వాళ్లే ఇల చేస్తే ఎలా అని వాపోతున్నారు. ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ కంపెనీ ఓలాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఓలా ఫ్లాంట్‌ను షట్‌ డౌన్‌ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి రాగా 3 వారాల్లో సుమారు 400 నుంచి 350 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఓలా తొలగించిన ఉద్యోగుల్లో ప్రొడక్ట్, మార్కెటింగ్, సేల్స్, సప్లై, టెక్, బిజినెస్, ఆపరేషన్స్ సహా అన్ని ఇతర డిపార్ట్‌మెంట్‌లకు చెందిన ఉద్యోగులున్నారు. వారికి నెల రోజుల ప్యాకేజీ, నోటీస్‌ పిరియడ్‌ అవకాశం కల్పించారు. దీనితో ఉద్యోగులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఇటీవల బ్యాటరీ లోపాల కారణంగా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వాహనదారులు సైతం ఆ సంస్థ ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు వెనకఅడుగు వేశారు. దీనితో ఫండింగ్‌ సమస్యలు తలెత్తాయి. తమ ఆర్ధిక సమస్యల నుంచి తప్పించు కోవాలి అని ఓలా 500 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా పనితీరును బట్టి ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించాలి అనే నిర్ణయం లో ఉన్నారు అనే విషయం వెలుగులోకి వచ్చిందని నివేదికల్లో పేర్కొన్నాయి. అంతేకాదు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై దృష్టిపెట్టిన ఓలా ఆ సంస్థ అనుసంధానంగా ఉన్న ఓలా కేఫ్‌, ఫుడ్‌ పాండా, ఓలా ఫుడ్స్‌,ఓలా డ్యాష్‌లను మూసి వేసింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -