end
=
Saturday, January 18, 2025
వార్తలుఅంతర్జాతీయంరెప్పపాటులో తప్పిన ప్రమాదం... వృద్ధుడు సేఫ్‌
- Advertisment -

రెప్పపాటులో తప్పిన ప్రమాదం… వృద్ధుడు సేఫ్‌

- Advertisment -
- Advertisment -

రెప్పపాటులో ప్రమాదం జరిగేది. కానీ ఇంకా భూమి మీద బతకాలని రాసిఉంది. అందుకే ఆ వృద్ధుడు రైలు ప్రమాదం నుండి కను రెప్పపాటులో బతికి బయటపడ్డాడు. విషయం ఏంటంటే … అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన వృద్ధుడు (66) నడవలేడు వీల్‌ చైర్‌కు పరిమితమయ్యాడు. రైల్వేట్రాక్‌ దాటాలని వస్తున్నాడు.. కానీ ఆ వీల్‌ చైర్‌ రైలు పట్టాల్లో ఇరుక్కుంది. అనుకోకుండా అదే సమయానికి అటు నుండి రైలు వేగంగా వస్తుంది. ఇక ప్రాణాల మీద నమ్మకం వదిలేకుసుకున్నాడు.

అప్పుడే ఆ క్షణంలోనే ఎరికా అనే మహిళ అటుగా వెళుతుంది. దీన్ని గమనించిన ఆమె మెరుపువేగంతో వచ్చి ఆ వృద్ధుడు కూర్చున్న వీల్‌చైర్‌ను పట్టాలపై నుండి తప్పించింది. బతుకుజీవుడా అంటూ ఆ వృద్ధుడు బతికాడు. చూశారా … భూమి మీద నూకలు మిగిలాయని ఇలాంటి సంఘటనలను బట్టే సామెత పుట్టి ఉంటుంది బహుశా.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -