end

పాత వీడియో కొత్త సమస్య

  • సమ్మక్క, సారలమ్మ జాతరపై చినజీయర్‌స్వామి అనుచిత వ్యాఖ్యలు

తెలంగాణ అతి పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలపై శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్నజీయర్‌ స్వామి చేసిన వాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో పాతదే అయినా ఇప్పుడది తెలంగాణలో ఆదివాసిలను కించపరిచేవిధంగా మాట్లాడినట్లుగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే పది సంవత్సరాల క్రితం మా టీవీలో చేసిన వాఖ్యలపై ఇప్పుడు పలు సంఘాలు, వివిధ పార్టీ నాయకులు చిన్న జీయర్‌స్వామిపై మండపడడం, నిరసన తెలపడం ఆశ్యర్యాన్ని కలిగిస్తున్నాయి.

ఆ వీడియోలో ఏమన్నారు?

”అసలు సారక్క సమ్మక్క ఎవరు? పోనీ దేవతలా? బ్రహ్మ లోకం నుంచి దిగి వచ్చారా? ఏమిటి చరిత్ర? అదేదో ఒక అడవి దేవత, ఏదో గ్రామ దేవత. సరే చేసుకోని అక్కడుండే వారు. చదువుకున్న వారు, పెద్ద వ్యాపారస్తులు.. ఆ పేరున బ్యాంకులు పెట్టేశారు. దట్ బికేమ్ ఎ బిజినెస్ నౌ. ఎంత అన్యాయమో చూశారా అండీ?’

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సీతక్క స్పందించి చిన్న జీయర్‌స్వామి వెంటనే తెలంగాణ ప్రజలకు, ఆదివాసి సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆహంకారంతో మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె అన్నారు. కొన్ని చోట్ల చిన్న జీయర్‌స్వామి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. చెప్పుల దండలు వేస్తున్నారు. ఏదేమైనా పది సంవత్సరాల క్రితం వీడియో ఇప్పుడు సోషల్‌మీడియా పుణ్యమా అని గందరగోళం సృష్టిస్తుంది.

Exit mobile version