ఆలివ్ ఆయిల్ మధుమేహాన్ని తగ్గించడం లో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్(Cholesterol) తో బాధపడేవారు ఆలివ్ ఆయిల్ వాడచ్చు. డయాబెటిస్(Diabetes) గలవారికి వారి ఆహారం, పానీయాల విషయం లో చాలా ఆందోళన పడుతుంటుంటారు. మనం చేసుకునే వంటకాలల్లో ముఖ్యం గా డయాబెటిస్ గలవారు ఆలివ్ ఆయిల్ ని వాడితే మధుమేహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో చాలా తక్కువ మొత్తంలో ఫైబర్, చక్కెర, కేలరీలు, పిండి పదార్థాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం లో ఆలివ్ ఆయిల్(Olive Oil Health Benefits) బాగా పని చేస్తుంది.. ఆలివ్ లో ఒలియోప్రొపీన్ ఉంటుంది. ఇది ఆలివ్‌లలో అత్యంత శక్తివంతమైన పాలీఫెనాల్. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
(చియా విత్తనాలు…ఆరోగ్య రహస్యాలు)
ఈ నూనెలో ఉండే పాలీఫెనాల్స్(Polyphenols) రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల(Antioxidants) వల్ల ఇన్సులిన్ పెంచడంలో ఇది సహాయపడుతుందని చాలా పరిశోధనల్లో తేలింది. అంటే మధుమేహం ఉన్నవారికి ఆలివ్ ఆయిల్ చాలా మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ టైప్-2 డయాబెటిస్ వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా అరికడుతుంది.
ఆలివ్‌నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయని నిపుణులు అంటున్నారు. రోజూ ఒక స్పూన్ ఆలివ్‌నూనె ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆందోళన, ఊపిరితిత్తుల వ్యాధులు, రొమ్ము క్యాన్సర్(Chest Cancer), మెనోపాజ్ తర్వాత అల్జీమర్స్ వంటి వ్యాదులు దరిచేరకుండా నివారిచడంలో సహాయపడుతుంది. ఆలివ్‌నూనెలో పాలీఫినాల్స్, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. రక్త నాళాల్లో కొవ్వు పేరుకోకుండా చేసి, రక్తప్రసరణను సరిగ్గా జరిగేలా చూస్తుంది. ఆరోగ్యానికేకాకుండా చర్మం కాంతికి , జుట్టు పెరుగుదలకి కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. ఆలివ్ నూనెను కాస్త వేడి చేసి, తలకి పట్టించి మసాజ్ చేసుకుంటే జుట్టు(Hair Growth) బలంగా పెరుగుతుంది.
(జుట్టు విపరీతంగా రాలిపోతోందా…?)