రెండంకెల కేసులు నమోదయినట్లు వెల్లడించిన అధికారులు
Omicron BF-7 variant: కరోనా (Covid virus) మహమ్మారి మళ్లీ జడలు విప్పుకుని విలయతాండవం చేస్తుంది. అయితే ఈసారి ఊహించినదానికంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమైక్రాన్ (Omicron)తో ముగిసిపోయిందనుకున్న కొవిడ్ మళ్లీ కొత్త రూపంలో దాడిచేస్తుంది. తాజాగా గుజరాత్ (Gujarath)లోని వడోదర (Vadodara)లో ఓ ఎన్‌ఆర్‌ఐ (NRI) మహిళకు ఈ వేరియంట్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు. జీనోమ్ సీక్వెనింగ్‌లో వేరియంట్ (Variant in genome sequencing) సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో సదరు మహిళతో పాటు మరో ముగ్గుర్ని ఐసోలేషన్ (Isolation)కు తరలించారు. ఇప్పటివరకు భారత్‌లో 3 ఒమిక్రాన్ BF-7 వేరియంట్ (Omicron BF-7 variant)కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్‌లో రెండు కేసులు నమోదు కాగా మరో కేసు ఒరిస్సా (Odissa) లో వెలుగుచూసింది. దీంతో వైద్యారోగ్య అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్టులలో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ర్యాండమ్ టెస్ట్‌లు (Random tests) చేయాలని కేంద్రం ఆదేశించింది. చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కంపల్సరీగా కరోనా టెస్ట్‌లు (Test) చేయాలని అధికారులు ఆదేశించారు.
తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం (America, UK, Australia, Belgium) దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలే ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్‌గా మారుతుందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్ (Global times)పత్రిక పేర్కొంది. అయితే.. చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు భారత్ (India)లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. గుజరాత్‌లో రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు నమోదు కావడంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయా (Airport)ల్లో హై అలర్ట్ (Hi Alert) ప్రకటించారు.
అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణం ఉన్న బీఎఫ్.7 (BF.7) అనే సబ్ వేరియంట్ ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒక్క మంగళవారం రోజే 3,049 బీఎఫ్.7 సబ్ వేరియంట్ కరోనా (BF7 Sub Variant) కేసులు చైనాలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వేల కొద్దీ కేసులు వెలుగుచూస్తుండటంతో చైనాలో వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మళ్లీ కఠిన ఆంక్షలకు చైనా తెర లేపింది. ఈ బీఎఫ్.7 సబ్ వేరియంట్ సోకిన వ్యక్తులు చనిపోతుండటం కూడా చైనా భయానికి కారణంగా తెలిసింది. చైనాలో ఈ వేరియంట్ కారణంగా ఆదివారం నాడు రెండు మరణాలు, సోమవారం నాడు ఐదు మరణాలు (Deths) నమోదయ్యాయి. దీంతో.. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేగింది. అయితే.. చైనా మీడియా (China media)చెబుతున్న దాని కంటే మరింత ప్రమాదకర పరిస్థితులున్నాయని అంతర్జాతీయ మీడియా వాపోతోంది.
BF.7 సబ్ వేరియంట్ గురించి:
ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతున్న ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ (Omicron sub variant) BF.7 అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్. దాదాపు సంవత్సరం క్రితం కొన్ని దేశాలను ఈ వేరియంట్ వణికించింది. మరీ ముఖ్యంగా.. అమెరికాలో 2021, అక్టోబర్‌లో BF.7 సబ్ వేరియంట్ కేసులు భారీగా నమోదయ్యాయి. యూకేలో నమోదైన కరోనా కేసుల్లో కూడా 7 శాతం కేసులు ఈ బీఎఫ్.7 వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం. వైద్య నిపుణుల ప్రకారం.. 500 ఒమిక్రాన్ సబ్-వేరియంట్స్ ప్రపంచ దేశాల్లోని కొందరు ప్రజలను కరోనా బారిన పడేలా చేశాయి. ఆస్ట్రేలియా, బెల్జియం దేశాల్లో కూడా ప్రస్తుతం BF.7 సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వేరియంట్లతో పోల్చితే రోగ నిరోధక శక్తిని తగ్గించి మనిషిని కుంగదీసి ప్రాణాలను పొట్టనపెట్టుకునే ప్రమాదకర వేరియంట్ ఈ BF.7 సబ్ వేరియంట్ అని ప్రచారం జరుగుతోంది. వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. BA.1, BA.2, BA.5 వేరియంట్ల కంటే వేగంగా వ్యాప్తి చెందే సబ్ వేరియంట్ ఒమిక్రాన్ BF.7 అని తెలిసింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, వాంతులు, డయేరియా ఈ బీఎఫ్-7 ప్రధాన లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు
చైనా అల్లకల్లోలం:
ఒమిక్రాన్ BF-7 వేరియంట్ కారణంగానే చైనాలో .. కరోనా పరిస్థితి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అధికార యంత్రాగం చేతులు ఎత్తేయడంలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. అంబులెన్స్‌ల కోసం వేలాది ఫోన్ కాల్స్ రావడంతో తలలు పట్టుకుంటున్నారు అధికారులు. ఆఖరికి కరోనాతో చనిపోయిన వాళ్ల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా వెయిటింగ్ లిస్ట్ (Waiting list)పెరిగిపోతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 తోనే చైనాలో వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. బీజింగ్‌తో సహా పలు నగరాలలోని ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనాతో చనిపోయిన వాళ్ల శవాల గుట్టలే కన్పిస్తున్నాయి. కరోనాతో రానున్న రోజుల్లో లక్షలాదిమంది చనిపోయే అవకాశముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో 60 శాతం జనాభాకు కరోనా సంక్రమించే అవకాశముందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ అత్యున్నత స్ధాయి సమీక్ష నిర్వహించింది. కరోనా ముప్పు ఇంకా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ (Union Health Minister Mansukh Mandaviya). రద్దీ ప్రాంతాల్లో జనం మాస్క్‌లను (MASK) ధరించాలని కేంద్రం సూచించింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ (Booster dose)వేసుకోవాలని సూచించింది.