end

మరోసారి భారీ మిస్సైల్‌ పరీక్ష

  • 2000 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన మిస్సైల్‌
  • ఫోటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా

భారీ క్షిపణుల పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న ఉత్తర కొరియా మరోసారి అతిపెద్ద బాలిస్టిక్‌ మిసైల్‌ను పరీక్షించిన ఫోటోలను ఉత్తర కొరియా ప్రభుత్వం అధికారికంగా రిలీజ్‌ చేసింది. సముద్రమట్టానికి సుమారు 2000 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన ఫోటోలు కనబడుతున్నాయి. ఆ ఫోటోల్లో ఉత్తర కొరియా ద్వీపకల్పంతోపాటు ఇతర ప్రాంతాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హాసాంగ్‌-12 బాలిస్టిక్‌ క్షపిణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. పరీక్ష అనంతరం ఆ మిస్సైల్‌ను సముద్రంలో కూల్చి వేశారు.

అయితే ఇప్పటికే ఏడు భారీ మిసైళ్లను ఉత్తర కొరియా పరీక్షలు నిర్వహించడం పట్ల ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి. సుమారు 30 నిమిషాలపాటు ఈ భారీ మిస్సైల్‌ పరీక్ష జరిగినట్లు, అలాగే 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్‌, సౌత్‌ కొరియా అధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా నిర్వహించిన మిస్సైల్‌ పరీక్షలను యునైటెడ్‌ నేషన్స్‌ ఖండించింది.

Exit mobile version