end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంశ్రీశైలం అగ్ని ప్రమాదం - ఒకరి మృతి
- Advertisment -

శ్రీశైలం అగ్ని ప్రమాదం – ఒకరి మృతి

- Advertisment -
- Advertisment -

శ్రీశైలం ఎడమ గట్టు దోమలపెంట వద్ద గల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటనలో ఒక మృతదేహం లభించింది. మృతుడు ఎ.ఇ సుందర్‌గా గుర్తించారు. మిగిలిన 8 మంది ఆచూకీ కోసం పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీనివాస్‌, ఏఈలు మోహన్‌, ఫాతిమా, వెంకటరావు, ప్రాజెక్టు అసిస్టెంట్‌ రాంబాబు, జేపిఏ కిరణ్‌, అలాగే అమర్‌ రాజా బ్యాటరీస్‌కు చెందిన ఎలక్ర్టీషీయన్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వీరి ముమ్మరంగా గాలిపుం చర్యలు చేపడుతున్నారు.

శ్రీశైలం విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

దట్టమైన పొగ వల్ల పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడం వల్ల గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, ఎమ్మెల్యే బాలరాజు, కలెక్టర్‌ శర్మన్‌ తదితరులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ దుర్ఘటనతో బాధిత కుంటుంబాల సభ్యులు చాలా ఆందోళనకు గురవతున్నారు. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని గుబులు చెందుతున్నారు.

నడిరోడ్డు మీద బిజెపి నాయకుని మర్డర్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -