end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంమళ్లీ ఉల్లి లొల్లి...!
- Advertisment -

మళ్లీ ఉల్లి లొల్లి…!

- Advertisment -
- Advertisment -
  • భారీ వర్షాల కారణంగా ఉల్లిపంటకు తీవ్ర నష్టం
  • రైతు బజారుల్లో రూ.35కే కిలో ఉల్లి

ఏపీ ఉద్యోగులకు‌ తీపి కబురు

భారీ వర్షాల కారణంగా దేశంలో ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని తాకాయి. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ధర నియంత్రణ చర్యలు చేపట్టింది. వ్యాపారులు అక్రమంగా నిల్వ ఉంచిన ఉల్లిపాయలపై ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో ఉల్లి ధరలు పెంచరాదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు బజార్లలో కేవలం రూ.35కే కిలో ఉల్లిగడ్డ విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ర్ట మార్కెటింగ్‌ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ముంబై మెస్మరైజింగ్ విక్టరీ

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ వ్యక్తికి రెండు కిలోల చొప్పున ఉల్లిగడ్డలు విక్రయిస్తామని చెప్పారు. ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రైతు బజార్లలో రూ.35కు ఉల్లిపాయలు కొనుగోలు చేయవచ్చునని వివరించారు. అయితే బహిరంగ మార్కెట్‌లలో రూ.90 నుండి రూ.120 వరకు కిలో ఉల్లిపాయ అమ్ముతున్నారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వ్యాపారులు అక్రమ నిల్వలు చేయకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

టీఆఎర్‌ఎస్‌ ఎంపి రాములుకు కరోనా పాజిటివ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -