end

అప్పుడే ప్రధాని టీకా తీసుకుంటారు

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా నిన్నట్నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కానీ, ప్రధాని మోదీ టీకా ఎప్పుడు తీసుకుంటారనే చర్చ దేశ ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం ముందే చెప్పినట్లు మొదట ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చిన తర్వాత, కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా అందిస్తారు. ఆ తర్వాత రెండో విడతలో 50 సంవత్సరాలు దాటిన వారికి టీకా ఇవ్వనున్నారు. రెండో విడత సమయంలో రాజకీయ నాయకులు, మంత్రులు టీకా తీసుకుంటారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం అప్పుడే టీకా తీసుకుంటారని తెలుస్తోంది.

Exit mobile version