- ఎమ్మేల్యేల కొనుగోలు’పై అగ్రనేతల మౌనం
- ప్రగతి భవన్ సైలెంట్ పై అనేక అనుమానాలు
- క్లారిటీ ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్
(Parag Agarwal : ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఔట్)
ఆపరేషన్ ఫాం హౌజ్ (Operation Farm House)ఎపిసోడ్ లో ప్రగతిభవన్ సైలెంట్(Pragati Bhavan is silent)గా ఉన్నది. సీఎం కేసీఆర్ (CM. KCR)మంత్రులు కేటీఆర్ (KTR) హరీశ్ (HARISH)ఇంత వరకు పెదవి విప్పలేదు. మొయినాబాద్ (MOINABAD) ఫాం హౌజ్ కు వెళ్లిన నలుగురు ఎమ్మెల్యే (MLA)లతో పలు దఫాలుగా చర్చలు జరిపారే తప్పా, ఏ విషయాన్ని కూడా ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు. మీడియా (Media)సమావేశం పెట్టి సీఎం కేసీఆర్ ఏదో చెప్తారని పార్టీశ్రేణులు ఆసక్తిగా ఎదురుచూశారు. పక్కా ఆధారాలు (proofs)చూపిస్తారని భావించారు. కానీ ఆయన ప్రెస్ మీట్ (press meet) ఉండదని చెప్పడంతో నిరాశ చెందారు. ఎలాంటి ఎవిడెన్స్ (evidence) లేదేమోనని చర్చించుకుంటున్నారు. అయితే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ (twitter)వేదికగా మాత్రమే స్పందించారు. కేసు విచారణ దశలో ఉందని, ఎవరూ మాట్లాడవద్దని సూచించారు. తమకు ప్రలోభాలకు గురిచేసిందెవరనే విషయంపై నలుగురు ఎమ్మెల్యేలు కూడా మీడియా ముందుకు వచ్చి వివరిస్తారని టీఆర్ఎస్ లీడర్లు మొదట లీకులు ఇచ్చినా ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు.
వరుస మీటింగ్స్:
అధిష్టానం ఆదేశాలతో బాధిత ఎమ్మెల్యేలు ఉదయమే ప్రగతిభవన్ కు చేరుకున్నారు. వారితో పలు దఫాలుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సమావేశమైనట్టు తెలిసింది. కేసు విచారణ టైమ్‌లో పార్టీ (party)పరంగా తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై చర్చించినట్టు (discussion)తెలిసింది. అయితే పార్టీ మారేందుకు ఎప్పుడు ఆఫర్ (offer)వచ్చింది? ఇంకా ఏ ఏ ఎమ్మెల్యేలతో టచ్ లో (touch)ఉన్నారు? అంటూ సీఎం కేసీఆర్ కూడా వారితో అడిగినట్లు సమాచారం.
(Harish Rao:యాదవ – కురమల సభలో మంత్రి హరీశ్ రావు)
అర్ధరాత్రి హడావుడి.. తర్వాత మౌనం
ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ అడ్డుకున్నారని మంత్రులు, ఎమ్మెల్యేలు హడావుడి చేశారు. ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు (Dharnas, burning of effigies) చేశారు. మునుగోడు ఎన్నికల (election)ప్రచారంలో ఉన్న మంత్రులు నేషనల్ హైవే (national highway)పైకి వచ్చి మరీ రాస్తారోకో చేశారు. కానీ గురువారం రోజు ఆ విషయంపై ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.
‘ఆపరేషన్ ఫాం హౌజ్’
ఎలక్షన్ టైమ్ లోనే బేరసారాలు.. నాడు ‘ఎమ్మెల్సీ’ (MLC) ఎన్నికల్లో సీక్రెట్ కెమెరాలు (SECRET CAMERA)ఇప్పుడు ఎలక్షన్ టైమ్ లో లీడర్ల బేరసారాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థి పార్టీని వీక్ చేయడం కోసం పదవులు, డబ్బులు ఎర వేయడం సర్వసాధారణంగా మారింది. జిల్లా, మండల స్థాయి లీడర్లకు ఆఫర్లు (Offers for district and mandal level leaders) ఇవ్వడం కామనే. అయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బడా లీడర్లను కొనుగోలు వ్యవహారాలు బహిర్గతమవుతుండడం రాజకీయ దుమారాన్నే రేపుతున్నాయి.
(MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్ ఎత్తివేయలేం)
సీక్రెట్ కెమెరాలతో.. 2015లో జరిగిన అసెంబ్లీ (Assembly)కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్(TRS)అభ్యర్థిని ఓడించేందుకు రేవంత్ రెడ్డి (Revanth reddy)పన్నిన వ్యూహాన్ని సీక్రెట్ కెమరాలతో పోలీసులు బహిర్గతం చేశారు. నోటుకు ఓటు కేసులో ఏసీబీ పోలీసులు (Acb police)కీలకంగా వ్యవహరించారు. సీసీ కెమెరాలు అమర్చి నోట్ల కట్టలు పెట్టడం వరకు ప్రతి విషయాన్ని పక్కాగా ప్లాన్ తో చేశారు. ఇప్పుడు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు డబ్బులు, కాంట్రాక్టులను ఎరగా చూపిందని బీజేపీపై ఆరోపణలున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఆపరేషన్ ఫామ్ హౌజ్లో సీపీ స్టీఫెన్ రవీంద్ర (CP Stephen Ravindra)కీలకంగా వ్యవహరించారు.