end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంనగరంలో ఒప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌
- Advertisment -

నగరంలో ఒప్పో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్‌లోని పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రంలో 5జీ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. 5జీ టెక్నాలజీ వ్యవస్థలో కీలకమైన ఉత్పత్తుల టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రం పనిచేస్తుంది. దేశంలో 5జీ టెక్నాలజీ ఉత్పత్తులను త్వరితగతిన ప్రవేశపెట్టడానికి ఇది దోహదపడనుంది. ఒప్పో కంపెనీకి 5జీ టెక్నాలజీ అభివృద్ధి కీలకమని, భారత్‌లో టెక్నాలజీల అభివృద్ధిని కంపెనీ పటిష్టం చేసుకుంటుందని ఒప్పో ఇండియా ఆర్‌అండ్‌డీ అధిపతి, వైస్‌ ప్రెసిడెంట్‌ తస్లీమ్‌ ఆరిఫ్‌ తెలిపారు. ఇక్కడ అభివృద్ధి చేసే టెక్నాలజీలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని, భారత్‌ను ఇన్నోవేషన్‌ హబ్‌గా మార్చడానికి సహకరిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌తోపాటు దేశంలో కెమెరా, పవర్‌ అండ్‌ బ్యాటరీ, పెర్‌ఫార్మెన్స్‌ కోసం మూడు ఫంక్షనల్‌ ల్యాబ్‌లను ఒప్పో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మధ్య ప్రాచ్య, ఆఫ్రికా, దక్షిణాసియా, జపాన్‌ తదితర దేశాల్లో ఉత్పత్తి, టెక్నాలజీల అభివృద్ధి బృందాలకు కూడా భారత అర్‌అండ్‌డీ కేంద్రంలోని నిపుణులు మార్గదర్శనం చేస్తున్నట్లు ఆరిఫ్‌ వివరించారు. కాగా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా హైదరాబాద్‌లో ఒప్పో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -