end

LIC పాలసీల పునఃరుద్దరణకు మరో అవకాశం

భారతీయ అతిపెద్ద జీవిత బీమా కార్పోరేషన్‌ (LIC) బీమా పాలసీదారులకు శుభవార్త తెలిపింది. ఎవరైతే తమ వ్యక్తిగత జీవిత బీమా పాలసీలను మధ్యలోనే ఆపేశారో వారికి మళ్లీ పాలసీని పునఃరుద్దరణకు అవకాశం కల్పించింది. అదికూడా ఆలస్య రుసుములో రాయితీని ఇస్తూ పాలసీలను పునఃరుద్దరణ చేసుకోవాలని తెలిపింది. ఇదేగాకుండా ఎల్‌ఐసీ తర్వలో ఐఓపీకి వెళ్లనుంది. ఫిబ్రవరి 7 నుండి మార్చి 25 వరకు జీవిత బీమా పాలసీలను పునఃరుద్దరణ చేసుకోవచ్చని ఎల్‌ఐసీ తెలిసింది.

గత రెండు, మూడేళ్లుగా కోవిడ్‌ వల్ల ఉద్యోగాలు, ఉపాధి లేక ప్రజలు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది పాలసీదారులు కూడా కోవిడ్‌ దెబ్బకు కన్నుమూశారు. కనీసం మిగిలిన కుటుంబ సభ్యుల కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, పరిస్థితులకనుగుణంగా నిలబడడానికి జీవితబీమా ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో మధ్యలో ఆపేసిన జీవిత బీమా పాలసీలను పునఃరుద్దరణ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నిలిచిపోయిన బీమా ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో 20%, గరిష్టంగా రూ.2,000, అలాగే ప్రీమియం రూ.3 లక్షలకు మించితే ఆలస్య రుసుములో 30%, గరిష్టంగా రూ.3000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలకు ఆలస్య రుసుము పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఎల్‌ఐసీ వెల్లడించింది. అయితే ఐదేళ్ల లోపు ఆగిపోయిన పాలసీలకు మాత్రమే ఈ అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

Exit mobile version