end

Orange:ఆరెంజ్ ను తప్పకుండా తినాలి.. ఎందుకు?

కొన్ని పండ్లని చూడగానే లేదా వినగానే ఉవిల్లు ఉరుతాయి అందులో ఆరెంజ్ ఒకటి. ఇది తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది. నారింజ పండ్లలో ఎన్నో పోషకాలు అదికంగా ఉంటాయి.. నారింజ పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ సీజన్ లో నారింజలు పుష్కలంగా లభిస్తాయి. నారింజ పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది. అలాగే జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఆరెంజ్, ఆరెంజ్ జ్యూస్ , ఆరెంజ్ తొక్కల తో కూడా లాభాలు ఉన్నాయి. దీనిలో మనకి కావల్సిన బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌(Fiber)తోపాటు విటమిన్ సి లు ఉంటాయి. నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. నారింజలో ఉండే ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

(Guava: జుట్టు రాలడాన్ని అరికట్టే అద్భుత ఔషధం జామాకులు)

విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

సిట్రస్ ఫ్రూట్(Citrus Fruit) అయిన నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి తోనే మన రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ పండ్లలోని ఫోలేట్, రాగి వంటి అనేక పోషకాలు మన ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడంలో సాయపడతాయి. వీటి వల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి.

గర్భిణీ స్త్రీలకు మంచిది

గర్భిణీ(Pregnant Ladies) లకి ఈ టైమ్ లో ఏది అయిన పుల్ల పుల్ల గా తినాలి అనిపించడం సహజం. నారింజ ఎక్కువ గా తినడం వల్ల కడుపు లో బిడ్డ బలంగా పెరిగెందుకు సహాయపడుతుంది. బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. దీనిలో ఉండే విటమిన్ బి , ఫోలేట్ లు డీఎన్ఏ(DNA) ను తయారుచేయడానికి ఉపయోగపడతాయి. నారింజ పండ్లు మెడిసిన్స్ తో సమానం అని చెప్పడం లో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండును తింటే శరీరం లోని చక్కెర స్థాయి(Sugar Levels) తగ్గుతుంది.అలాగే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  

 

పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది

ఈ పండులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్దకం(Constipation) సమస్యను పోగొట్టడంలో చక్కగా పనిచేస్తుంది. ఈ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల పేగులను శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ ఫైబర్ కంటెంట్ శరీరం లో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్(Hemoglobin) శాతాన్ని పెంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రించి గుండె ను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా నివారించి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.నారింజ పండును తినడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. 

(Eye Brows:కనుబొమ్మలు అందంగా ఉండాలి అంటే)

Exit mobile version