end

రేషన్‌ సరఫరాకు ఇక OTP

రేషన్‌ దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఈ విధానానికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి ఓటీపీ పద్దతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఇప్పటికే చర్యలు చేపట్టింది. కాగా, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లబ్దిదారుల్లో 30 శాతం మందికి ఆధార్‌తో మొబైల్‌ లింక్‌ లేనట్లు తేలింది. ఇందుకోసం మీ సేవా కేంద్రాల్లో మొబైల్‌ నెంబర్‌ను లింక్‌ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచిస్తోంది. కాగా, ఓటీపీ విధానం అందుబాటులోకి వచ్చినా.. డీలర్లు తమ విధిని కొనసాగించనున్నారు.

Exit mobile version