end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయండిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !
- Advertisment -

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

- Advertisment -
- Advertisment -
  • కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఉస్మానియా యూనివర్సిటీ నిర్ణయం
  • డిగ్రీ సెకండియర్‌, ఫైనలియర్‌ పరీక్షలపై కూడా సమీక్షా

తెలంగాణలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేసింది. అంతేగాకుండా విద్యార్థులను ద్వితీయ సంవత్సరంకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది.

B.A, B.C.A, B.Sc, B.B.A, B.Com కోర్సులు చదివే విద్యార్థులందరినీ ప్రమోట్‌ చేయనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. అయితే డిగ్రీ సెకండియర్‌, ఫైనలియర్‌ పరీక్షలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వర్సిటీ అధికారులు తెలిపారు. పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఏదేమైనా ఈ కరోనా వైరస్‌ వల్లగత సంవత్సరం నుండి విద్యార్థులు చదువులు సరిగా సాగడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నా కూడా ప్రత్యక్ష తరగతులు ఉన్నంత అనుభూతిని గానీ, విజ్ఞానాన్ని గానీ పొందడం లేదనేది వాస్తవం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -