తామనుకున్నట్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యం నెరవేరిందని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బిహార్‌లో బీజపీని అతిపెద్ద పార్టీగా నిలపాలని తాము భావించామని.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందంటున్నాడు చిరాగ్. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన ఎల్జేపీ.. జేడీయూపై తీవ్ర విమర్శలు చేసింది. కానీ, బీజేపీకి మాత్రం తమ మద్దతు తెలిపింది. జేడీయూ అభ్యర్థులకు వ్యతిరేకంగా తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ఎల్జేపీ.. తద్వారా జేడీయూ ఓట్లను చీల్చిందని చెప్పవచ్చు. దీనివల్లే జేడీయూ మెజర్టీ స్థానాలు గెలవలేకపోయింది. బీజేపీ బలంగా పుంజుకుంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది.