end
=
Sunday, June 30, 2024
వార్తలుమా భూములు మాకావాలే
- Advertisment -

మా భూములు మాకావాలే

- Advertisment -
- Advertisment -
  • ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితులు ఆందోళన
  • లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలి

రాయపోల్ :  రీజినల్ రింగ్ రోడ్డు వద్దు మా భూములు మాకు కావాలి లేదా రోడ్డు ఆలైన్మెంట్ మార్గం అయిన మార్చాలని ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసిత రైతులు ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదివారం రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసితుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ చీమల జగదీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు (Regional ring road) బేగంపేట, ఎల్కల్ గ్రామాల గుండా వెళ్తుందని ఆ రోడ్డు మాకు వద్దు అంటూ మా భూములు మాకే కావాలి, భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని (Agriculture) అలాంటి భూమి రోడ్డులో పోతే మా బతుకుదెరువు కష్టమవుతుందని రైతులు ఆందోళన చేపట్టడం జరుగుతుందన్నారు. లేదంటే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో రోడ్డు మార్గం ఆలైన్మెంట్ మార్చాలన్నారు. అది కుదరకపోతే 2013 భూ హక్కుల చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ కన్నా రెండింతలు అదనంగా నష్టపరిహారం భూ నిర్వాసితులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

గతంలో పలుమార్లు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట్ గ్రామాల రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారని, (Land) భూములు కోల్పోతే రైతులకు ఎంతో నష్టం జరుగుతున్నదన్నారు. అలాంటి రైతులకు జీవనాధారమైన వ్యవసాయ భూములు కోల్పోతే బతుకుదెరువు కష్టమవుతుందన్నారు. (Law and Order)  కాబట్టి రైతులకు న్యాయం చేసి ప్రస్తుత భూమి ధరలను బట్టి భూమి కోల్పోయే రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సురేశ్‌ కుమార్, ఎల్కల్ బేగంపేట గ్రామాల రైతులు కుమార్, పిట్ల స్వామి, జాల రాజయ్య, మల్లేశం, శ్రీశైలం, బర్కం మల్లేష్, స్వామి, రమేశ్‌, చిన్న మల్లేశం పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -