కన్నతండ్రే కన్న కూతురు పట్ల వక్ర బుద్ధి చూపించాడు. కూతురి అభ్యంతరకర ఫోటోలు తీసి తన ల్యాప్‌టాప్‌లో పొందుపరిచాడు. ఆ రహస్యంగా ఉన్న ఫోటోలను చూస్తే రాక్షసానందం పొందుతున్నాడు. ఈ అనుచిత పరిస్థితి, దుర్భర సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ”కంచె చేను మేస్తే, కాసేదెవరు” అన్న సామెత ఇలాంటి సందర్భాలు వలనే పుట్టిందేమో అనిపిస్తుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన సొంత తండ్రే తన సొంత కూతురు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకున్నాడు.
నాచారం ప్రాంతంలో రెస్టారెంట్ ఓనర్‌గా పని చేస్తున్న నిందితుడు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. ఓ రోజు బాధితురాలు ల్యాప్‌టాప్ తీసి చూడగా తండ్రి నిర్వాకం బట్టబయలైంది. కన్నతండ్రి ల్యాప్‌టాప్‌లో తన అభ్యంతరకర ఫోటోలు చూసి ఆమె తల్లడిల్లిపోయింది, లోలోపలే కుమిలిపోయింది. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.