end
=
Friday, September 20, 2024
సినీమాఎస్‌పీబీకి పద్మ విభూషన్, చిత్రమ్మకు పద్మ భూషన్‌
- Advertisment -

ఎస్‌పీబీకి పద్మ విభూషన్, చిత్రమ్మకు పద్మ భూషన్‌

- Advertisment -
- Advertisment -

న్యూఢిల్లీ: 2021 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఏడుగురికి పద్మ విభూషణ్‌, 10 మందికి పద్మభూషణ్‌, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దివంగత గాయకుడు ది గ్రేట్ సింగర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానికి పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించారు. ప్రముఖ గాయని చిత్రను పద్మభూషణ్ అవార్డు వరించింది. జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్ ప్రకటించారు. కర్ణాటకకు చెందిన డాక్టర్ మొనప్ప హెగ్డేకు, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీకి, ఢిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్‌కు, బీబీ లాల్‌కు, ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూకు కూడా పద్మ విభూషణ్ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌కి, మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు, గుజరాత్‌ బీజేపీ నేత కేశూభాయ్‌కి పద్మభూషణ్‌ ప్రకటించారు.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి బాల సుబ్రమణ్యంకు పద్మ విభూషణ్‌ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. మరో నలుగురికి పద్మశ్రీ అవార్డులు కట్టబెట్టింది. వీరిలో ఏపీ నుంచి కళల విభాగంలో రామస్వామి అన్నవరపు, నిడమోలు సుమతి.. సాహిత్య రంగం నుంచి ప్రకాశ రావు ఆసవడి ఈ పురస్కారానికి ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి కళల విభాగంలో కనకరాజు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -