Munigode By ELections మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ (Congress MLA Contestant) అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని(Palvay Sravanthi) అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ పీసీసీ (TPCC) నలుగురు అభ్యర్థుల జాబితాను ఢీల్లికి పంపించింది. మనుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లిస్టులో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, పల్లె రవి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎఐసీసీ అందరి పేర్లను పరిశీలించి, లోకల్‌గా మనుగోడులో ఎవరికి పేరు ప్రతిష్టలు ఉన్నవో వారికే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాల్వాయి స్రవంతికి మంచి పేరు ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. అలాగే స్రవంతి కూడా గతంలో కూడా గట్టి పోటీ నిచ్చి ఓట్లు కూడా గరిష్ట స్థాయిలో సాధించారు. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ముఖుల్ వాస్నిక్ స్రవంతి పేరును ప్రకటించారు.
నమ్మకాన్ని నిలబెడుతా..
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు స్రవంతి. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నెలబెట్టుకుంటానని ఆమె తెలిపారు. తనకు అండగా నిలిచిన పార్టీ కార్యర్తలకు, అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడతానని, మనుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాగా తన తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి(Palvay Goverdhan Reddy) చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆమె అన్నారు.