end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంపంచతత్వ పార్కు.. ఎన్ని ప్రత్యేకతలో
- Advertisment -

పంచతత్వ పార్కు.. ఎన్ని ప్రత్యేకతలో

- Advertisment -
- Advertisment -

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం ఉదయం ఇందిరాపార్కులో పంచతత్వ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితర అధికారులు హాజరయ్యారు. పార్కు ప్రత్యేకతలివే.. ఈ పార్కులో ఎనిమిది అంశాల‌తో ఒక ఎక‌రం విస్తీర్ణంలో ఆక్యూప్రేజ‌ర్ (శ‌రీరంపై ఒత్తిడి క‌లిగించు)వాకింగ్‌ను నిర్మించారు. కంకరరాళ్లు, నల్లరేగడి మట్టి, నీరు, ఇసుక, చెక్కపొట్టు, గులకరాళ్లతో ట్రాక్‌ నిర్మాణం చేపట్టారు. నడుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలోని నరాలపై ఒత్తిడి పడేలా ట్రాక్‌ను నిర్మాణం ఉంది. మంత్రి ఆదేశాల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో పార్కుల‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించిన విషయం విదితమే.

దోమ‌లగూడ‌లోని ఇందిరా పార్కు నందు ఒక ఎక‌రం విస్తీర్ణంలో పంచ‌త‌త్వ ఆక్యూప్రెజ‌ర్ వాకింగ్ ట్రాక్ పార్కును అభివృద్ది చేశారు. ఎక‌రం విస్తీర్ణంలో స‌ర్కిల్ ప‌ద్ధతిలో ట్రాక్‌పై న‌డుస్తున్నప్పుడు పాదాల అడుగు భాగంలో ఉన్న న‌రాల‌పై వివిధ స్థాయిలో ఒత్తిడిని క‌లిగించేలా 20 ఎం.ఎం, 10 ఎం.ఎం రాళ్లు, రివ‌ర్ స్టోన్స్‌, 6 ఎం.ఎం చిప్స్‌, ఇసుక‌, చెట్ల బెర‌డు, న‌ల్లరేగ‌డి మ‌ట్టి, నీటి బ్లాక్‌ల‌ను విడివిడిగా అనుసంధానం చేస్తూ వాకింట్ ట్రాక్‌ను నిర్మించారు. ఈ స‌ర్కిల్‌కు అన్ని వైపులా 40 ర‌కాల మెడిసిన‌ల్, హెర్బల్‌ ప్లాంట్స్‌ను బ్లాక్‌లుగా ఏర్పాటు చేశారు. మొద‌ట‌గా న‌రాల‌పై అధిక ఒత్తిడి క‌లిగించే ట్రాక్ నుంచి క్రమ ప‌ద్ధతిలో ఒత్తిడి త‌గ్గించే ట్రాక్ వైపు న‌డ‌వ‌టం వ‌ల్ల ర‌క్తప్రసర‌ణ‌లో సానుకూల మార్పు జ‌రిగి వివిధ ర‌కాల అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -