end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌వంటలుPaneer 65 : ప‌న్నీర్‌ 65 తయారీ
- Advertisment -

Paneer 65 : ప‌న్నీర్‌ 65 తయారీ

- Advertisment -
- Advertisment -

Paneer 65 : పిల్లలెప్పుడూ చిరుతిల్ల(Snacks)కోసం గొడవ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా స్కూల్(School) నుంచి రాగానే సాయంత్రం ఏదో ఒకటి అడుగుతారు.అప్పుడు త్వరగా అయిపోయి అదిరిపోయే ప‌న్నీర్‌ 65(Paneer 65) చేసి పెడితేసరి. ఇప్పుడు దానిగురించి తెల్సుకుందాం. పిల్లలు ప‌న్నీర్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ప‌న్నీర్‌ పాల‌తో చేసిందే అయినా, పాల కంటే రుచిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్, విట‌మిన్ సి, విట‌మిన్ బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబ‌ర్ ఇలా ఎన్నో పోష‌క విలువలు(Nutritional values) క‌లిగి ఉండ‌టం వ‌ల్ల ప‌న్నీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.అందులోనూ పిల్ల‌ల‌కు త‌ర‌చూ ప‌న్నీర్ పెడితే ఎముక‌లు, దంతాలు, కండ‌రాలు గ‌ట్టి ప‌డ‌టంతో పాటు వారి పెరుగుదల మెరుగ్గా మారుతుంది.

(స్వీట్ కార్న్ తో ప్రయోజనాలు)

కావలసిన పదార్ధాలు:

ప‌న్నీర్‌– ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి6, కొత్తిమీర, మైదా– పావు కప్పు, కార్న్‌ ఫ్లోర్‌ – ఒక టీ స్పూను, అల్లం వెలుల్లి పేస్టు – ఒక టీస్పూను కారం – రుచికి సరిపడినంత పసుపు, ఉప్పు కొంచెం గరం మసాలా – టీస్పూను, నూనె – సరిపడినంత.

తయారీ విధానం :

ముందుగా ఒక గిన్నె లో కొన్ని వాటర్ తీసుకొని స్టవ్‌ మీద పెట్టి గోరువెచ్చగా చేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకున్నా పన్నీర్(Paneer) ని ఆ వాటర్ లో ఒక ఐదు నిమిషాలు ఉండనివ్వలి. తర్వాత అవి ఉన్నదానికంటే మరింత మెత్తగా అవుతాయి. ఇప్పుడు స్టవ్‌ మీద  కడాయి పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా పన్నీర్ ముక్కలను లైట్ గా ఫ్రై(Fry)చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, రెండు గా చీల్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ని వేసి వేగాక అల్లం పేస్టు వేసి పచ్చి వాసన పోయెదాక వేగానివ్వాలి.తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచం కారం(పిల్లల కోసం), పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.. కొంచెం సేపు వేగిన తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం నీరు పోసి ఉడికించాలి. ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను వేసి కలపాలి.ఇష్టం ఉన్నవారు టొమోటో కేచప్ వేసుకోవచ్చు. చివరగా చిన్నగా కట్ చేసుకున్నా వెలుల్లి ముక్కలని తరిగిన ఉల్లికాడ ముక్కలని వేసి కొంచం గరం మసాలా వేసి కోతిమిర తో గార్నిష్(Garnish) చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన పన్నీర్ 65 రెడీ..

(Chicken Fry : చికెన్ ఫ్రై చేసుకోండిలా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -