end

పన్నీర్‌ సెల్వానికి భారీ షాక్‌…

ఏఐఏడీఎంకే నేత ఓ పన్నీర్‌సెల్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చెన్నైలోని వనగరంలో సోమవారం జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో జయలలిత మరణం తర్వాత ఎడప్పాడి పళనిస్వామి, ఓ పన్నీర్ సెల్వం వర్గాల మధ్య సయోధ్య కోసం ఏర్పాటు చేసిన ద్వంద్వ నాయకత్వ విధానాన్ని రద్దు చేశారు. పార్టీకి ఎకైక తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి(ఈపీఎస్) ఎన్నికయ్యారు. దీంతో పార్టీ పగ్గాలు పళనిస్వామి చేతులోకి చేరాయి. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పునరుద్ధరించి.. కోఆర్టినేటర్, సంయుక్త కోఆర్డినేటర్ పోస్టులను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో మొత్తం 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

పార్టీలో ఒకే నాయకత్వాన్ని తీసుకురావాలని జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని అన్నాడీఎంకే నేత పళనిస్వామి అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తున్న ఏకైక పార్టీ అన్నాడీఎంకే అని పేర్కొన్నారు. తన చిత్తశుద్ధితో కూడిన పనులను చూసి దివంగత సీఎం జయలలిత రహదారులు & పీడబ్ల్యూడీ వంటి శాఖలను ఇచ్చారని గుర్తు చేశారు. మంత్రిగా ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఆ పథకాలనే ప్రస్తుతం సీఎం స్టాలిన్ తమ పార్టీ స్టిక్కర్లను అతికించి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్యంగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే చీలికదిశగా సాగుతోంది. పార్టీలో ద్వినాయకత్వాన్ని కొనసాగించడంపై ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కాస్తా రసాభాసగా ముగిసిన అనంతరం ఇక చీలిక తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ద్వినాయకత్వాన్ని మెజారిటీ నాయకులు వ్యతిరేకిస్తోన్నారు. ప్రత్యేకించి పన్నీర్ సెల్వం లీడర్‌షిప్‌ను ఏ మాత్రం అంగీకరించట్లేదు.

చెన్నైలో గురువారం సాయంత్రం నిర్వహించిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీర్ సెల్వంపై వాటర్ బాటిళ్లు విసిరేంతగా. పన్నీర్ సెల్వం మాట్లాడుతున్న సమయంలో పలువురు జనరల్ కౌన్సిల్ సభ్యులు ఆయనపై వాటర్ బాటిళ్లను విసిరేశారు.మళ్లీ ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం వచ్చేనెల 11వ తేదీన ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అదే నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక ఉన్నందున
ఏ కూటమికి మద్దతు ఇవ్వాలనేది అప్పుడే తేల్చేస్తారని అంటున్నారు. తాజా భేటీ రసాభాసగా ముగిసినందున వచ్చే నెలలో నిర్వహించే సమావేశం కీలకంగా మారుతుందని, 23 తీర్మానాలను పునఃసమీక్షించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. దీని తరువాత పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

Exit mobile version