Para sports : దక్షిణ భారతదేశంలోనే(South India) అతిపెద్ద కంపెనీ అయిన జి స్క్వేర్ (G SQUARE), ధీమాన్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కలిసి అంతర్జాతీయ క్రీడా వేదికలపై అద్వితీయమైన ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో(Wings of Fire) అవార్డుల కార్యక్రమం గచ్చిబౌళిలోని వెస్టన్ హోటల్ ఏర్పాటు చేసింది. వింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పారా ఒలింపిక్ హై జంప్ గోల్డ్ మెడలిస్ట్ (Para Olympic High Jump) , మరియప్పన్ తంగవేలు,వేణు వినుకోటి , ఎస్ మేధ జయంత్, ఎస్ ఆర్ తేజస్విని , పారా బ్యాడ్మింటన్ వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ మన్సి జోషి, పారా అథ్లెట్ ఛాంపియన్ ప్రణవ్ ప్రశాంత్ దేశాయ్, ఇంకా పలువురు పారా అథ్లెట్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ సాయి ప్రణీత్ , G స్క్వేర్ సీఈవో ఈశ్వర్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీ లత రెడ్డి(Deputy Mayor Srilatha Reddy) , తెలంగాణ పారా ఒలింపిక్ స్పోర్ట్స్ జనరల్ సెక్రటరీ సంజీవయ్య ,G స్క్వేర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. పారా అథ్లెట్లు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు.పారా ఒలింపిక్ స్పోర్ట్స్ లో గత కొన్నేళ్లుగా అద్భుత కనపరుస్తున్న భారత క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు జి స్క్వేర్ కంపెనీ సీఈవో ఈశ్వర్ తెలిపారు. తమలోని లోపాలను పక్కనపెట్టి అంతర్జాతీయ క్రీడావేదికలపై సత్తా చాటుతున్న పారా అథ్లెట్లు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.
జి స్క్వేర్ కంపెనీ గురించి :
జి స్క్వేర్ కంపెనీ చెన్నై హైదరాబాద్ మైసూర్ కోయంబత్తూర్ బళ్ళారి వంటి ప్రధాన్ నగరాల్లో దాదాపు పది సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కంపెనీ రంగంలో అగ్రగాముగా వెలుగొందుతుంది.దశాబ్ద కాలంగా 60కు పైగా ప్రీమియం ప్రాజెక్టులను ఆరువేలకు పైగా కస్టమర్లను 1000 ఎకరాలకు పైగా గేటెడ్ కమ్యూనిటీలను విక్రయించిన ఘనత జి స్క్వేర్ సొంతం.
ధీమాన్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ :
ధీమాన్ సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ పారా స్పోర్ట్స్ లో రాణిస్తున్న వారికి డిజేబుల్ పర్సన్స్ కి స్ఫూర్తినిస్తూ పలు చారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా పారా స్పోర్ట్స్ అథ్లెట్స్ కి ప్రత్యేకమైన సెషన్స్ తో పాటు చారిటీ పరంగా ఎంతో సహాయాలు అందిస్తుంది. దీనిలో భాగంగానే జి స్క్వేర్స్ సంస్థ కలిసి రింగ్స్ ఆఫ్ ఫైర్ పేరుతో ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది.