- వేలాది పక్షులను బలితీసుకుంటున్న భయంకరమైన వ్యాధి
- ప్రతి ఏడాది అక్టోబర్‌లోనే సంక్రమిస్తున్న సీజనల్ డిసీజ్
లోరికీట్ పెరాలసిస్ సిండ్రోమ్ (Lorikeet Paralysis Syndrome) (LPS) అనేది ప్రతి ఏడాది అక్టోబర్ (October- june), జూన్ మధ్య సంక్రమించే సీజనల్ డిసీజ్ (Seasonal disease). దీని వలన లోరికీట్స్ (Lorikeets ) (ఆస్ట్రేలియన్ చిలుకలు) (Australia) ఆకాశం నుంచి పడిపోయి కదల్లేకుండా ఉంటాయి. పక్షి శాస్త్రవేత్తలు, పశువైద్యులకు ఈ సిండ్రోమ్ గురించి చాలా ఏళ్లుగా తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా ఈ వ్యాధికి కారణాన్ని కనుగొనలేకపోయారు. ఈ మేరకు ప్రతి ఏటా (every year) వేలాది పక్షులను ప్రభావితం చేస్తున్న ఈ భయంకరమైన వ్యాధి చాలాసార్లు వాటికి ప్రాణాంతకంగా మారుతోంది. ఎందుకంటే ఈ వ్యాధి సోకిన తర్వాత అవి తమను తాము పోషించుకోలేవు లేదా ప్రిడేటర్స్ (Predators) నుంచి తప్పించుకోలేవు.
ఈ వ్యాధి కాలుష్యం ఫలితంగా ఉత్పత్తి (Production as a result of pollution) చేయబడిన, పురుగుమందులతో సంబంధమున్న టాక్సిన్ (toxin) కాదని సిడ్నీ (sydney)యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొఫెసర్ డేవిడ్ ఫాలెన్ ( University’s School of Veterinary Science) (Professor David Fallen) చెప్పారు. పైగా ఇది అంటువ్యాధి (Epidemic) కూడా కాదని తమకు తెలుసన్నారు. కొన్నేళ్లుగా అనేక సిద్ధాంతాలు లోరికీట్ పెరాలసిస్ సిండ్రోమ్ మిస్టరీ (Lorikeet Paralysis Syndrome Mystery) పరిష్కరించేందుకు ప్రయత్నించాయి. కానీ ఇప్పటివరకు వాటిలో ఏదీ నిర్ధారించబడలేదు. అయితే చాలా విస్తృతంగా ఆమోదించబడిన సిద్ధాంతం ప్రకారం.. అక్టోబర్, జూన్ మధ్య నెలల్లో లోరీకీట్స్ తినే మొక్క వల్ల LPS ఏర్పడుతుంది. వ్యాధి కాలానుగుణతతో పాటు ఆస్ట్రేలియాలోని (Australia)కొన్ని ప్రాంతాల్లో సంభవిస్తుందనే వాస్తవం ఖచ్చితంగా ఆ దిశను సూచిస్తుంది. కానీ ఇప్పటివరకు ఆ మొక్క ఏదో ఎవరూ గుర్తించలేకపోయారు.
ఇక ఈ సిండ్రోమ్ (syndrome)కు సంబంధించి క్లినికల్ (clinical)సంకేతాలు తీవ్రతలో మారుతూ ఉంటాయి. ఎగరలేకపోవడం, మెడ (neck), నాలుక (tongue)తో పాటు అన్ని అవయవాలకు పక్షవాతం (Paralysis), మింగలేకపోవడం, రెప్ప వేయలేకపోవడం వంటి లక్షణాలు (symptoms) కనిపిస్తాయి. ఈ మేరకు కొన్ని పక్షులు ఆహారంలేక (food), మరికొన్ని వాహనాల కిందపడి చనిపోతాయి. లేదా వాటి కదల్లేని స్థితి కారణంగా భూమిపై ఉన్న వేటాడే జంతువులు లేదా చీమలకు (Ant)ఆహారమవుతాయి.