పవన్ పేరు వింటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.. నేడు పవర్ స్టార్ పుట్టిన రోజు(Happy Birthday). సెప్టెంబర్ 2 అంటే పవన్ అభిమానులకు ఒక పండగే.ఈ రోజు పవన్ 51వ జన్మదినం కావడంతో సోషల్ మీడియా(Social Media)లో హాల్ చల్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సోదరుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయినా.. ఆ ప్రభావం ఎక్కడా కనబడనీయకుండా తనకంటూ ఓ రేంజ్ లో గుర్తింపు ఒక బ్రాండ్ మార్క్ తెచ్చుకున్నారు. తన నటన, మేనరిజం తో ప్రేక్షుకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రతి సినిమాలోనూ తనలోని కొత్త వేరియేషన్స్ పవర్ ని చూపిస్తూ.. ‘పవర్ స్టార్’ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంది. పవన్ పేరు వింటేనే అభిమానులకు ఓ సెన్షేషన్. ఆయన అంటే పడిచచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు.
ఇటీవలే భీమ్లానాయక్ సినిమాతో హిట్ కొట్టిన పవన్ ఇప్పుడు క్రిష్(Krish) దర్శకత్వంలో హరిహర వీర మల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది.పవన్ కళ్యాణ్ హీరోగానే కాదు నిర్మాత(Producer)గానూ వ్యవహరించారు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై సినిమాలు నిర్మాతగా ఉన్నారు . ముగ్గురు మొనగాళ్లు, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. దర్శకుడి మారి జానీ సినిమా తీశారు. ఇక తన సినిమాల్లో కొన్నింటికి స్టంట్స్ మాస్టర్(Stunts Master)గానూ పని చేశారు. జానీ, గుడుంబా శంకర్, సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాలకు కథా సహకారం కూడా అందించారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వపరంగా ఒక మంచి వ్యక్తి(Typical person). తాను అంత పెద్ద హీరో అయినా ఎదో అసంతృప్తి. సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూసి జనం కోసం ఏది అయిన చెయ్యాలనే కోరిక ఆయనలో మొదలైంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతిపరుల అరాచకాలు చూసి జనం కోసం రాజకీయాల్లోకి(Politics) వచ్చిన మహానుభావుడు. 2014 మార్చి 14న జనసేన పార్టీ (Janasena Party)ని పవన్ స్థాపించారు. 2014 ఎన్నికలలో ఏపీలో పోటీచేయకుండా ప్రధాని మోడీ(PM MODI), చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగారు. అయితే ఆయనకు నిరాశే ఎదురైంది. అయినా కూడా జనం కోసం ఇప్పటికీ పోరాడుతున్నారు పవన్.