end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంPawan Kalyan:24న కొండగట్టుకు జనసేనాని
- Advertisment -

Pawan Kalyan:24న కొండగట్టుకు జనసేనాని

- Advertisment -
- Advertisment -

  • ‘వారాహి’కి ప్రత్యేక పూజ చేయించనున్న పవన్

టాలీవుడ్ నటుడు, జనసేన పార్టీ (Janasena party)అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan kalyan) యాత్రకు సిద్దమవుతున్నారు. ఏపీలో(AP) తలపెట్టిన బస్సు యాత్ర (BUS YATRA)కోసం ‘వారాహి’ (VARAHI) పేరిట ప్రత్యేక వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేయించుకున్నారు. ఈ వాహనానికి ఈ నెల 24న పుణ్యక్షేత్రం కొండగట్టులో (Kondagattu)పూజలు జరిపించనున్నారు. పవన్ కళ్యాణ్‌ యాత్రపై జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ యాత్రలో భాగంగా 32 నారసింహ స్వామి క్షేత్రాలను (arasimha swamy kshetralu) పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ధర్మపురిలో (darmapuri) నారసింహస్వామి ఆలయం నుంచి పవన్ కళ్యాణ్ యాత్రను ప్రారంభించనున్నారు. జనవరి 24న ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి (Anjaneya swami) ఆలయాన్ని దర్శిస్తారని, వారాహి వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని నిర్ణయించారని జనసేన పార్టీ తెలిపింది.

పవన్ కళ్యాణ్ తలపెట్టే అతి ముఖ్య కార్యక్రమాలను కొండగట్టు నుంచి ప్రారంభించడాన్ని శుభసూచకంగా భావిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. 24న కొండగట్టులో అంజన్నను దర్శించుకుని, వారాహికి పూజలు చేయిస్తారు. తర్వాత కొండ దిగువ ప్రాంతంలో 35 నియోజకవర్గాలకు చెందిన జనసేన కన్వీనర్లు (conniver), రాజకీయ నాయకులతో సమావేశమవుతారు. రాబోయే ఎన్నికలకు (election)సంబంధించిన వ్యూహాలను, చేపట్టబోయే కార్యక్రమాలను చర్చించి దిశానిర్దేశం చేస్తారు. ఆ కార్యక్రమంలో ముగిసిన తర్వాత ధర్మపురికి చేరుకుంటారు. స్వామి వారి ఆలయంలో పూజలు చేసి అనుష్టుప్‌ నారసింహ యాత్రను ప్రారంభిస్తారు. ఆ తర్వాత క్రమేణా మిగిలిన 31 క్షేత్రాలను పవన్‌ సందర్శిస్తారు. పవన్ కళ్యాణ్‌ తన ఇష్టదైవమైన జగిత్యాల (Jagityala)జిల్లా మల్యాల (Malyala)మండలంలోని కొండగట్టు (kondagattu)ఆంజనేయస్వామి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ వారాహి వాహనానికి సంప్రదాయ పూజ నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 2009లో పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ప్రాంతానికి వచ్చినప్పుడు విద్యుత్తు తీగలు తగిలి ప్రమాదం బారినపడ్డారు. ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు ఆయన విశ్వసిస్తుంటారని జనసేన పేర్కొంది.

(Andhrapradesh:సచివాలయంలో 14వేల పోస్టులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -