end
=
Saturday, October 5, 2024
సినీమాఎంతైనా పవన్‌ సింప్లిసిటీయే వేరప్పా..
- Advertisment -

ఎంతైనా పవన్‌ సింప్లిసిటీయే వేరప్పా..

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అందుకు కారణం ఉండనే ఉంటుంది. రెండేళ్లకు పైగా పూర్తి స్థాయి రాజకీయాలకు పరిమితమైన పవన్.. అభిమానుల కోరిక మేరకు, పార్టీ నిధుల కోసం మళ్లీ సినిమా బాట పట్టాడు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

ఈ సినిమా ఎంట్రీకి ముందు గడ్డంతో ర‌ఫ్‌ లుక్‌తో క‌న‌ప‌డిన ప‌వ‌న్‌, ‘వ‌కీల్‌సాబ్’‌ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వగానే స్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. ‘వ‌కీల్‌సాబ్’‌ సినిమా సెట్‌లో ఫ్యాన్స్‌తో ప‌వ‌న్ తీసుకున్న లేటెస్ట్ ఫొటో నెట్టింట వైర‌ల్అవుతుంది. ఫ్యాన్స్‌తో పాటు మోకాళ్లపై కూర్చుని ప‌వ‌న్ ఫొటో తీసుకున్న తీరుకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఎంతైనా పవన్‌ సింప్లిసిటీని మెచ్చుకోవాల్సిందే. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ఉంటాడు. కాగా, బాలీవుడ్ సినిమా ‘పింక్’‌కు రీమేక్‌గా ‘వ‌కీల్‌సాబ్’ మూవీ రూపొందుతోంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి ఇందులో కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శకుడు. టాప్ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, బోని కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -