end

తప్పుకున్న జనసేన.. బీజేపీకి మద్దతివ్వాలన్న పవన్‌

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. జనసైనికులు, అభిమానులంతా మూకుమ్మడిగా బీజేపీబీకి ఓటు వేసి, గెలిపించాలని పవన్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మన ముందున్న ప్రత్యమ్నయం ఇదేనని జనసేనాని సైనికులకు హితబోధ చేశారు. నాదెండ్ల మనోహర్ నివాసంలో బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ కె. లక్ష్మణ్‌తో భేటీ అయిన పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2014లో బీజేపీతో కలిసి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, కార్యకర్తలకు ఇష్టం లేకపోయినా పోటీ నుంచి తప్పుకుంటున్నామన్నారు. జనసైనికులు కాస్త నిరుత్సాహానికి గురైనా, ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నగర రక్షణ కోసం బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు పవన్‌.

దుబ్బాక ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చిద్దామనుకున్నామని.. కానీ అంతలోనే ఎన్నికలు రావడం వల్ల అది కుదరలేదన్నారు. ఈ సమయంలో ఓట్లు చీలకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగరంలో బలమైన వ్యవస్థ ఉండాలని, బీజేపీ గెలవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఎన్నికల బరిలో నిలుచోలేదన్నారు. నిరుత్సాహపడొద్దని జనసైనికులకు పవన్‌ విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రోడ్ మ్యాప్ రూపొందించుకుంటామని జనసేనాని తెలియజేశారు.

Exit mobile version