end

Constipation:మలబద్దకం ఉన్న వాళ్లు ఈ టిప్స్‌ పాటిస్తే సరి..

Constipation:ఈ మధ్యకాలంలో యువత, ఉద్యోగులు, తదితరులు సమయం లేక ఫుడ్ ఆర్డర్ చేసుకొనో లేక, తరచూ ఫాస్ట్‌ఫుడ్(Fast Food) తీసుకోవడం వలనో, సమాయానికి భోజనం చేయలేకపోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ఊబకాయం(Obesity), ఆయాసం, మలబద్దకం లాంటివి ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా మలబద్దకం తగ్గాలంటే ఈ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజుకు మూడు స్ఫూన్లు చాలు..

అందులో ముఖ్యమైన టిప్స్..

  • మల విసర్జన క్రమం తప్పితే అది శరీరం అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ఈ సమస్య ఉన్న వారు పీచు పదార్ధాలు(Fibrous Food) ఎక్కువగా ఉండే పొట్లకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, సబ్జా గింజల్లాంటివి తరచూ తీసుకోవాలి. అలాగే నీరు పుష్కలంగా తాగాలి.
  • ఆకుకూరలు, గుమ్మడి గింజలు, బాదం, డార్క్‌ చాక్లెట్‌(Dark Chocolate) లాంటి మెగ్నిషియం ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా సుఖ విరేచనం జరుగుతుంది.
  • కాఫీ కూడా కండరాలను ఉత్తేజితం చేస్తుంది.
  • ఆల్కహాల్‌, ఫ్రైలు, డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది.

మానేరు డ్యాంలో పడి రెండేళ్ల బాలుడు మృతి

Exit mobile version