end

11 గంటల వరకు గ్రేటర్‌లో పోలైన ఎన్నికల శాతం

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కొన్ని చోట్ల గొడవలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు డివిజన్ల వారిగా పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

  • వనస్థలిపురం- 15.69%
  • హస్తినపురం- 12.23%
  • నాగోల్ -16.16%
  • మన్సూరాబాద్ -15.84%
  • బీఎన్‌ రెడ్డి నగర్- 15.76%
  • హయత్‌నగర్- 14.99%
  • కేపీహెచ్‌బీ -17.63%
  • బాలాజీనగర్- 16.27%
  • అల్లాపూర్‌- 22.70%
  • మూసాపేట- 29.16%
  • ఫతేనగర్‌- 17.05%
  • బోయిన్‌పల్లి- 14.06%
  • బాలానగర్‌- 11.67%
  • కూకట్‌పల్లి- 10.61%
  • వివేకానందనగర్-10.57 %
  • హైదర్‌నగర్- 13.46%
  • ఆల్విన్ కాలనీ-13.68 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

కాగా.. ఓల్డ్‌ మలక్‌పేట్‌ డివిజన్‌ 26లో పోలింగ్‌ రద్దు అయింది. మలక్ పేట డివిజన్ బ్యాలెట్ పేపరులో గుర్తు మారిన అంశాన్ని ఎన్నికల సంఘం గుర్తిచింది. వార్తా కథనాలతో పాటు సీపీఐ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ డివిజన్‌లో ఎన్నికల సంఘం పోలింగ్‌ను రద్దు చేసింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు బదులుగా సీపీఎం గుర్తు వచ్చింది. ఈసీ గుర్తులు పరిశీలించి పోలింగ్‌ రద్దు చేసింది. కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తికొడవలి నక్షత్రం గుర్తు రావడంతో ఈసీ ఈ నిర్ణయానికి వచ్చింది. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో 1, 2, 3, 4, 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌‌ను నిలిపివేశారు. ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ను ఈ నెల 3వ తేదీన నిర్వహించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

ఇదీ లెక్క.. డివిజన్‌లు 150, పోటీ చేస్తున్న అభ్యర్థులు 1,122 సగటున ఒక డివిజన్‌లో అభ్యర్థులు 8 (జంగంమెట్‌లో అత్యధికంగా 20 మంది, అత్యల్పంగా ఉప్పల్‌, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలికౌకి, జీడిమెట్లలో ముగ్గురు వంతున)

పోలింగ్‌ కేంద్రాలు 9,101 (అత్యధికంగా కొండాపూర్‌లో 99, అత్యల్పంగా రామచంద్రాపురంలో 33)

  • మొత్తం ఓటర్లు -74,44,260
  • పురుషులు- 38,77,688
  • మహిళలు- 35,65,896
  • ఇతరులు- 676
  • బ్యాలెట్‌ బాక్సులు -28,683
  • బ్యాలెట్‌ పత్రాలు- 81,88,686
  • పోలింగ్‌ సిబ్బంది 48,000.. 52,500 పోలీస్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు
Exit mobile version