end

మళ్లీ పెట్రో మంట, ఆగని ధరలు

petrol
petrol and disesel prices hiked again

మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా చమురు సంస్థలు ఆదివారం నాడు లీటర్‌ పట్రోల్‌పై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశంలో లీటరు పెట్రోల్‌పై రూ.3.70, డీజిల్‌పై రూ.3.75 వరకు ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు మార్చి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 139 డాలర్లకు చేరుకుంది. దీనివల్ల భారత ఇంధన రిటైలర్లు ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన పెట్రోల్‌కు 2.25 బిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రూ.19 వేల కోట్ల నష్టం కలిగినట్లు పెట్రో సంస్థలు అంచనా వేస్తున్నాయి.

పెరిగిన ధరలు దేశ వ్యాప్తంగా ఇలా వున్నాయి

  • హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 112.35, డీజిల్‌ రూ.98.68
  • న్యూ ఢిల్లీలో పెట్రోల్‌ రూ. 99.11, డీజిల్‌ రూ.90.42
  • ముంబైలో పెట్రోల్‌ రూ. 113.88, డీజిల్‌ రూ.98.13
  • విశాఖపట్నంలో పెట్రోల్‌ రూ. 113.08, డీజిల్‌ రూ.99.09
  • చెన్నైలో పెట్రోల్‌ రూ. 104.90, డీజిల్‌ రూ.95.00
  • కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 108.53, డీజిల్‌ రూ.93.57
Exit mobile version