పెట్రో కంపెనీలు మళ్లీ ప్రజలకు షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రో కంపెనీలు మళ్లీ ధరలు పెంచేశాయి. తాజాగా లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. ఇక పెరిగిన ధరల ఆధారంగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు రూ.110, లీటరు డీజిల్ ధర రూ.96.36కు చేరుకున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో పెట్రల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు చమురు సంస్థలు వంటగ్యాస్ ధరలను పెంచడం గమనార్హం.ఇక రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. దీని కారణంగా చమరులు సంస్థలు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
ఇక దేశంలో పెరిగిన పెట్రోలు ధరలు ప్రధాన నగరాలలో ఈ విధంగా ఉన్నాయి
న్యూఢిల్లీలో పెట్రోల్ రూ.96.21, డీజిల్ రూ.87.47
ముంబైలో పెట్రోల్ రూ.110.82, డీజిల్ రూ.95.00
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.110, డీజిల్ రూ.96.36
విజవాడలో పెట్రోల్ రూ.111.99, డీజిల్ రూ.97.90
గుంటూరులో పెట్రోల్ రూ.112.08, డీజిల్ రూ.98.10
కోల్‌కతాలో పెట్రోల్ రూ.105.51, డీజిల్ రూ.90.62
బెంగుళూరులో పెట్రోల్ రూ.101.42, డీజిల్ రూ.85.80
చెన్నైలో పెట్రోల్ రూ.102.16, డీజిల్ రూ.92.19