end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంపెట్రోల్‌ @ రూ.100
- Advertisment -

పెట్రోల్‌ @ రూ.100

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌ ధరలు
  • ఒక్క నెలలోనే 25 సార్లు ధరలు పెంపు
  • కేంద్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

ఊహించినట్లే జరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర వంద దాటింది. కేవలం నెలన్నర సమయంలో కేంద్రం సుమారు 25 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ అమాంతంగా పెంచుకుంటూ పోయింది. దీంతో రవాణా చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలే కరోనా కష్టకాలంలో నిత్యావరసర వస్తువుల ధరలు పెరుగుతుంటే కేంద్రం సామాన్య ప్రజల నడ్డి విరిచేందుకు కంకణం కట్టుకుంది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.20పైసలు కాగా డీజిల్‌ ధర రూ.95.14పైసలు.

జూన్‌ 20 వరకు వేసవి సెలవులు

కరోనా వల్ల గత సంవత్సరంపైగా ప్రజలు ఆదాయం లేక నానా ఇక్కట్లు పడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. చాలా మంది ప్రజలు తిండిలేక చనిపోతుంటే ప్రభుత్వం వేడుకచూస్తోంది. చమురు ఉత్పత్తి సంస్థలకు దేశాన్ని తాకట్టుపెట్టి వారు ఎలా ఆడిస్తే అలా కేంద్ర ప్రభుత్వం ఆడుతోంది. ఇలా ఎన్నాళ్లు ఇంధన ధరలు పెంచుకుంటూ పోతుంది అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలకు ఉపాధి కరువై పొట్టచేతపట్టుకొని సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అక్కడ కూడా సరైన పని లేక, తిండిలేక జీవితం వెళ్లదీస్తున్నారు. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదులో చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులే ఎక్కువ. అలాగే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో లీటరు పెట్రోలు రూ.65 ఉంటే ఇప్పుడు బీజెపీ హయాంలో ఏకంగా వంద రూపాయలు దాటేసింది. రవాణా ఖర్చులు చాలా పెరిగిపోయాయి. అటోలు, క్యాబ్‌లు, లారీలు, ప్రైవేటు వాహనాలు విపరీతంగా చార్జీలు పెంచేశారు. ఇక చిన్న ఉద్యోగుల పరిస్థితి చెప్పనవసరం లేదు. సగం జీతం పెట్రోల్‌కే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంధన ధరలు రోజువారి కార్యకలాపాలపై కూడా చాలా ప్రభావం చూపుతోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి అదుపుతప్పింది. ప్రజల ఆదాయం తగ్గించి, ఖర్చులు పెరిగాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను అదుపుచేయకపోతే ప్రజల నుండి చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -