end

Parlament :నూతన పార్లమెంటు భవన చిత్రాలు

  • ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం!

కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా పార్లమెంటు భవనసముదాయం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ (Central house, urban)వ్యవహరాల శాఖ చిత్రాలను షేర్ చేసింది. భారతదేశ ప్రజాస్వామ్య (Indian democracy) వారసత్వాన్ని ప్రదర్శించేలా ఈ నిర్మాణం ప్రతిబింబిస్తోంది. పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, బహుళ కమిటీ గదులు, భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ (Lounge, library, multiple committee rooms, dining areas, ample parking) స్థలం ఉన్నట్లు తెలిపింది.

కాగా రాజ్యసభ సామర్ధ్యం 384 సీట్లు, లోక్‌సభ సామర్థ్యం 888 సీట్లకు (Rajya Sabha has a capacity of 384 seats and Lok Sabha has a capacity of 888 seats) ప్రతిపాదనలు చేసింది. భవిష్యతులో స్థానాలు పెరిగే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. సెంట్రల్ హాల్ సీటింగ్ కెపాసిటీ (Central Hall Seating Capacity) 1,272 గా ఉండనుంది. వాస్తవానికి ఇప్పటికే నూతన పార్లమెంటు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రారంభిస్తారని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Exit mobile version