end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంకరోనా రోగులకు ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకం
- Advertisment -

కరోనా రోగులకు ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకం

- Advertisment -
- Advertisment -

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

కరోనా మహమ్మారి(కోవిడ్‌ 19) బారిన పడి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా థెరఫీ ఎంతో కీలకమని అనంతపురం జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రక్తనిధి కేంద్రంలో నెలకోల్పిన ప్లాస్మా సేకరణ కేంద్రాన్ని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన యంత్రం పనితీరును ప్రొఫెసర్‌ రామస్వామి నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు.

మూడు రోజులపాటు మళ్లీ భారీ వర్షాలు !

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మెరుగైన వైద్య చికిత్స కోసం రూ. 28 లక్షలు వెచ్చించి నూతన ప్లాస్మా యంత్రాన్ని నెలకోల్పినట్లు తెలిపారు. ఆరోగ్య వంతులు ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాస్మా దానం చేయవచ్చన్నారు. ఇప్పటికే 170 మందికి ప్లాస్మా థెరఫీ చికిత్స అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు.. రంగయ్య, మాధవ్‌, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌ రెడ్డి, జేసీ డా. సిరి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్‌ నీరజ తదితరులు పాల్గొన్నారు.

సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -